HRA Hike – ఆ ఉద్యోగులకు HRA, CCA పెంపు

Hra and cca

BIKKI NEWS (DEC. 28) : HRA and CCA hiked to GHMC merge area employees. మెడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని ముదుచింతలపల్లి, యెల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) 24 శాతం మరియు సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ (CCA) మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మున్సిపాలిటీలు తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో విలీనమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

HRA and CCA hiked to GHMC merge area employees.

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TGO), తెలంగాణ నాన్–గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TNGO), ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, స్టేట్ టీచర్స్ యూనియన్ తదితర సంఘాలు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించి ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది.

2020 సవరించిన పే స్కేల్స్ ప్రకారం చెల్లింపులు

ఉద్యోగులకు సవరించిన పే స్కేల్స్–2020 ప్రకారం HRA, CCA చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిర్ణయం 02 డిసెంబర్ 2025 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. సంబంధిత కాలానికి ఏరియర్లు కూడా విడుదల చేయాలని జిల్లా ఖజానా అధికారులను ఆదేశించారు.

అదనపు చెల్లింపులపై రికవరీ

HRA లేదా CCAలో ఏదైనా అదనపు చెల్లింపులు జరిగినట్లు గుర్తిస్తే, వాటిని ఉద్యోగుల జీతాల నుంచి లంప్‌సమ్‌గా తిరిగి వసూలు చేస్తామని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. ఉద్యోగులు తమ పే స్లిప్‌లను జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు.

ఈ ఉత్తర్వులు రెగ్యులర్ ఉద్యోగులందరికీ వర్తిస్తాయని, సంబంధిత శాఖలు ఆలస్యం లేకుండా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా ఖజానా అధికారి, సబ్ ట్రెజరీ అధికారులు, డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని తెలిపారు.

ఈ నిర్ణయంతో GHMCలో విలీనమైన మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా లాభం చేకూరనుంది.

ORDER COPY PDF

ఇవి కూడా చదవండి : Action on 35 junior lecturers – ఫేక్ సర్టిఫికెట్ల అంశంలో 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు.! | ఉద్యోగుల వార్తలు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →