Home loan – మళ్లీ తగ్గనున్న వడ్డీ రేట్లు

BIKKI NEWS (JULY 19) : HOME LOAN INTEREST RATES WILL DECREASE. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టులో నిర్వహించిన ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో రేపో రేటు ను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

HOME LOAN INTEREST RATES WILL DECREASE

దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్లు మరింత తగ్గనున్నాయి.

ఇప్పటికే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్ లో 25 బేసిస్ పాయింట్లు , జూన్ లో 50 బేసిస్ పాయింట్లు చొప్పున రేపో రేటు ను ఆర్బిఐ తగ్గించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రెపో రేటు 5.50 శాతంగా ఉంది. మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే రెపో రేటు 5.25% చేరనుంది.

దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి వడ్డీ రేట్ తగ్గడంతో ఈఎంఐ భారం తగ్గనుంది.