Red alert – నేడు అతిభారీ వర్షాలు

BIKKI NEWS (SEP. 27) : Heavy rains today in andhra pradesh and Telangana. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం పూరీకి 60 కిలో మీటర్ల గోపాల్పూర్ (ఒడిశా) కు 70 కిలోమీటర్లు, కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కు 180. కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైందని APSDMA పేర్కొంది.

Heavy rains today in andhra pradesh and Telangana.

కాసేపట్లో ఇది గోపాల్పూర్ వద్ద తీరం దాటనుందని ప్రకటించింది. దీంతో ఇవాళ ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ, మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది..

అలాగే నేడు తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది.

కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.