RAIN ALERT : భారీ వర్షాలు, సెలవు ఉన్న జిల్లాలు

Rain alert : భారీ వర్షాలు, సెలవు ఉన్న జిల్లాలు - bikki news

BIKKI NEWS (AUGM 20) : HEAVY RAINS AND HOLIDAY ANNOUNCED DISTRICTS IN TG and AP. రెండు తెలుగు రాష్ట్రాలలో బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో భారీ వర్షాలు పడే జిల్లాలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన జిల్లాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

HEAVY RAINS AND HOLIDAY ANNOUNCED DISTRICTS IN TG and AP

తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

మరోవైపు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాలలో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా స్కూళ్లకు సెలవు ప్రకటించలేదు.

తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక్క నిర్మల్ జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా పాఠశాలలు నడవనున్నాయి.

అయితే ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోనూ సెలవు ఇవ్వాలనే డిమాండ్ ఉంది..

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →