BIKKI NEWS : GK BITS 61 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
GK BITS 61 FOR COMPITITIVE EXAMS.
1) కాకతీయుల పాలనలో ఏ విదేశీ యాత్రికుడు మోటుపల్లిని సందర్శించాడు.?
జ : మార్కోపోలో
2) తెలంగాణలో నిజాంసాగర్ డ్యాం ఏ నదిపై నిర్మించబడింది.?
జ : మంజీరా
3) వైద్య పరీక్షలో ఉపయోగించే రేడియో ఐసోటోపులను ఏమని పిలుస్తారు.?
జ : ట్రేసర్స్
4) తెలంగాణలో దక్కన్ సిమెంట్ కర్మాగారం ఎక్కడ గలదు.?
జ : హుజూర్ నగర్
5) మంచినీటి పర్యావరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని అంటారు.?
జ : లిమ్నాలజీ
6) ఏ కులస్తులు సేవాలాల్ ను పూజిస్తారు.?
జ : లంబాడీలు
7) G-4 కూటమిలో గల దేశాలు ఏవి.?
జ : భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్
8) యక్షగానాన్ని తెలంగాణలో ఏమని పిలుస్తారు.?
జ : వీధి భాగవతం
9) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ఆర్కిటెక్ట్ ఎవరు.?
జ : హఫీజ్ కాంట్రాక్టర్
10) పక్షుల వలన జరిగే పలదీకరణాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఆర్నితోఫీలీ
11) సైనికులకు ఒకే ర్యాంక్ ఒకే పింఛన్ అమలుపై కేంద్రం నియమించిన జ్యుడీషియల్ కమిటీ చైర్మన్ ఎవరు.?.
జ : జస్టిస్ నరసింహారెడ్డి
12) జాతీయ టెక్నాలజీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 11న జరుపుతారు అందుకు గల కారణం ఏమిటి.?
జ : ప్రోఖ్రాన్ – 2 ప్రయోగాన్ని విజయవంతంగా జరిపిన రోజు
13) వృక్ష రాజ్య ఉభయచరాలు అని వేటిని పిలుస్తారు.?
జ : బ్రయో ఫైటా
14) అణు రియాక్టర్లలో ఉపయోగించే భారజలం యొక్క విధి ఏమిటి.?
జ : న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం
15) తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల జనాభా శాతం ఎంత.?
జ : 9.5%
16) తెలంగాణలోని ఏ గ్రామంలో మొదటగా బొగ్గు కనుగొన్నారు.?
జ : ఇల్లందు
17) ప్రపంచంలో ఎత్తైన ఏకశిలా బుద్ధ విగ్రహం ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్
18) హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియాన్ని స్థాపించినది ఎవరు?
జ : మూడో సాలార్ జంగ్
19) హైదరాబాద్ కాంటింజెంట్ మిలటరీ దళాల పోషణ కోసం నిజాం ప్రభుత్వం ఏ ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి అప్పగించింది.?
జ : బేరార్
20) రాష్ట్ర గవర్నర్ ఆర్డినెన్స్లను ఎప్పుడు జారీ చేస్తారు.?
జ : రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు
21) భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎలా ఎన్నికయ్యారు.?
జ : ప్రాంతీయ అసెంబ్లీ ద్వారా
22) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు.?
జ : 2010
23) షేర్ ఇ పంజాబ్ అని ఎవరిని పిలుస్తారు.?
జ : లాలా లజపతిరాయ్
24) భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కాలంలో వైస్రాయ్ ఎవరు.?
జ : డఫ్రీన్
25) తెలంగాణ భూదాన ఉద్యమంలో భాగంగా తన భూమిని దానం చేసిన భూస్వామి ఎవరు.?
జ : వెదిరె రామచంద్రారెడ్డి
26) ‘ది ఎండ్ ఆఫ్ ఎరా’ అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : కే యమ్. మున్షి
27) పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు.?
జ : 1985
28) పంచాయతీరాజ్ చట్టంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూలు తెగలకు రిజర్వేషన్ కల్పించే ప్రకరణ ఏది.?
జ : 243 (D)
29) తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమం ఎక్కడ నుంచి ప్రారంభమైంది.?
జ : కౌడిపల్లి – మెదక్ జిల్లా
30) జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది?
జ : 99వ రాజ్యాంగ సవరణ (2014)

