BIKKI NEWS : GK BITS 58 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
GK BITS 58 FOR COMPITITIVE EXAMS
1) సామాజిక కార్యకర్త అయిన మేధాపాట్కర్ ఏ ఉద్యమంతో సంబంధాన్ని కలిగి ఉన్నారు.?
జ : నర్మదా బచావో ఆందోళన
2) జల్ జంగిల్ జమీన్ అను నినాదాన్ని ఎవరు ఇచ్చారు.?
జ : కొమరం భీమ్
3) స్త్రీలలో ఫలదీకరణం జరిగే ప్రాంతం ఏది?
జ : పెలోపియన్ నాళము
4) బందీపూర్ జాతీయ వనము గల రాష్ట్రం ఏది?
జ : కర్ణాటక
5) శాతవాహనుల తొలి రాజధాని ఏది .?
జ : కోటిలింగాల
6) 1857 విప్లవ అనంతరం భారతదేశంలో బ్రిటిష్ వారు సంపూర్ణంగా అమలుపంచిన విధానం ఏది?
జ : విభజించు పాలించు విధానము
7)సార్క్ కూటమి భావన ఎవరి మెదడులో ఉద్భవించింది.?
జ : జియా ఉల్ రెహమాన్
8) శబ్దం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు?
జ : అకోస్టిక్స్
9) దేశానికి పూర్ణ స్వరాజ్యం సాధించాలనే తీర్మానాన్ని చేసిన లాహోర్ అఖిలభారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏ సంవత్సరం జరిగింది.?
జ : 1929
10) సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు.?
జ : సూరితి అప్పయ్య
11) శిల్ఫి గురు అను అవార్డును కేంద్ర ప్రభుత్వం నుండి పొందిన మొదటి తెలంగాణ హస్తకళల కళాకారుడు ఎవరు.?
జ : కోవా నానేశ్వర్
12) హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని ఎంత శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 33 శాతానికి
13) తాల్చేరు బొగ్గు గనులు గల రాష్ట్రం ఏది.?
జ : ఒడిశా
14) భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం అని ఎవరు వ్యాఖ్యానించారు.?
జ : ఐవర్ జెన్నింగ్స్
15) మసాబ్ ట్యాంక్ ను ఎవరు నిర్మించారు.?
జ : హయత్ భక్సీ బేగం
16) సాధారణ ఎఫ్.ఎం రేడియో స్టేషన్ నుంచి ప్రసారమయ్యే రేడియో తరంగా పౌనఃపున్యం ఎంత.?
జ : 93.5 M.Hz
17) కాకతీయుల కాలంలో వసూలు చేసే ఆస్తి పన్నును ఏ పేరుతో పిలుస్తారు.?
జ : పుల్లరి
18) తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కాకతీయ స్లోగన్ ఏమిటి.?
జ : మన ఊరు – మన చెరువు
19) భారత రాజ్యాంగంలో ఉమ్మడి పౌరస్మృతి ఏ అధికరణ ప్రకారం కల్పించారు.?
జ : 44వ అధికరణ
20) “ప్రాణహిత” అనే వ్యాస సంపుటాన్ని రచించినది ఎవరు?
జ : అల్లం నారాయణ
21) ఆవరణ వ్యవస్థకు ప్రధాన ఇంధనం ఏమిటి.?
జ : సూర్యుడు
22) వాయు కాలుష్యం ఏ ఆవరణలో ప్రధానంగా ఉంటుంది.?
జ : ట్రోపో స్పియర్
23) తెలంగాణ రాష్ట్రంలో బాల బ్రహ్మేశ్వర దేవాలయం ఎక్కడ ఉంది.?
జ : ఆలంపూర్ – జోగులాంబ గద్వాల జిల్లా
24) రజాకార్ అనే పదానికి భాషాపరమైన అర్థం ఏమిటి?
జ : స్వచ్ఛంద కార్యకర్త
25) జాతీయ గర్ల్ చైల్డ్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జనవరి 24
26) బాల్య వివాహాలను వ్యతిరేకించడానికి పూనేలో మహిళా ఆర్య సమాజ్ ఎవరు స్థాపించారు.?
జ : పండిత రమాబాయి సరస్వతి
27) ఉపగ్రహాల నుండి సంకేతాలను సంగ్రహించే స్టేషన్ తెలంగాణలో ఎక్కడ ఉంది.?
జ : షాద్ నగర్
28) ఏ రకమైన తెల్ల రక్త కణాలను పారిశుద్ధ్య కార్మికులు అని పిలుస్తారు.?
జ : మోనోసైట్స్
29) ఏ జీవులలో స్వేచ్ఛ రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.?
జ : కీటకాలు
30) బ్రహ్మపుత్రా నది ఎక్కడ జడ పిన్ను ఆకారంలో మలుపు తిరిగి ప్రవహిస్తుంది.?
జ : నమ్చా బర్వా
- TG SSC EXAM DATES – తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- Holidays – విద్యా సంస్థలకు సెలవులు
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- TELANGANA HOLIDAYS 2026 – తెలంగాణలో సెలవుల లిస్టు
- Today in history – చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 08

