Free Training – నిరుద్యోగ యువతకు ఉచిత వసతి, భోజనం తో శిక్షణ

BIKKI NEWS (AUG. 28) : Free training to unemployees at SRTI. స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంఘం – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా చారిటబుల్ ట్రస్టు సహకారంతో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్‌ లలో నివసిస్తున్న నిరుద్యోగ యువకులు – యువతుల కోసం ఉచిత శిక్షణ, భోజనం వసతితో పాటు ఉద్యోగం కల్పించాడును.

Free training to unemployees at SRTI

ఖాళీల వివరాలు:
క్ర.సంశిక్షణ కోర్సు పేరుశిక్షణ కాలంఅర్హత
1కంప్యూటర్ హార్డ్‌వేర్, సెల్‌ఫోన్ & ఎలక్ట్రానిక్ అప్లయన్స్ రిపేర్, సి.సి.టి.వి టెక్నీషియన్6 నెలలుపదవ తరగతి పాస్
2ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, కూల్‌కింగ్, బేకింగ్, పెయింటింగ్6 నెలలు8వ తరగతి పాస్
3ఎలక్ట్రికల్ (డొమెస్టిక్), సోలార్ సిస్టమ్స్ ఇన్‌స్టాలేషన్ మరియు సర్వీసింగ్6 నెలలుజూనియర్ ఇంటర్మీడియట్ పాస్
4ఆటోమొబైల్ వెల్డర్, హెల్పర్ మెకానిక్, ఫోర్‌వీలర్ డ్రైవర్3 నెలలుపదవ తరగతి పాస్
అర్హతలు:

అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాలు ఉండాలి. చదువుతున్న విద్యార్థులు అర్హులు కాదు.

కావాల్సిన సర్టిఫికెట్ లు

విద్య అర్హతల సర్టిఫికెట్ లు & జిరాక్స్ లు, ఆధార్, ఆదాయ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజు ఫోటో.

చిరునామా :

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంఘం, జలాల్‌పూర్ (గ్రా), భువనగిరి (మం), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.

దరఖాస్తు సమర్పించు తేదీ : : 03-09-2025 ఉదయం 10 గంటలకు నేరుగా హాజరవ్వాల్సి ఉంటుంది.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:

9133908000, 9133908111, 9133908222, 9948466111