Free Sarees – మహిళలకు ఉచిత చీరలు

BIKKI NEWS (JULY 16) : Free sarees for telangana women. తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ధనసరి సీతక్క తెలిపారు.

Free sarees for telangana women.

దసరా, దీపావళి పండుగలకు తెలంగాణ రాష్ట్ర మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు.

15 సంవత్సరాలు నిండిన, 60 ఏళ్లు దాటిన మహిళలందరినీ స్వయం సహాయక సంఘాలు సభ్యులుగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.

స్వయం సహాయక సంఘాలలో ఉన్న 67 లక్షల మంది ఐక్యంగా ఉండి వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.