BIKKI NEWS (SEP. 19) : Ekalavya model Residential schools job notification 2025. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లలో ఖాళీగా ఉన్న 7267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కొరకు ట్రైబల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Ekalavya model Residential schools job notification 2025
ఖాళీల వివరాలు :
- ప్రిన్సిపల్‌కు 225,
- పీజీటీకి 1460,
- టీజీటీకి 3962
- ఫిమేల్ స్టాఫ్ నర్స్‌కు 550,
- హోస్టల్ వార్డెన్ (Male/Female కలిపి): 635,
- అకౌంటెంట్‌కు : 61,
- జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్‌కు 228,
- ల్యాబ్ అటెండెంట్‌కు 146
విద్యా అర్హతలు :
- ప్రిన్సిపల్: ఉత్తీర్ణ్స్‌తో మాస్టర్స్ డిగ్రీ, బి.ఎడ్. (B.Ed.), సంబంధిత అనుభవం
- పీజీటీ: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, బి.ఎడ్. లేదా తత్సమాన విద్యార్హత
- టీజీటీ: సంబంధిత సబ్జెక్టులో గ్రాజుయేషన్, బి.ఎడ్., CTET ఉత్తీర్ణత
- హస్టల్ వార్డెన్: డిగ్రీ
- ఫిమేల్ స్టాఫ్ నర్స్: నర్సింగ్‌లో డిప్లొమా/డిగ్రీ, కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కనీసం 2½సంవత్సరాల అనుభవం
- అకౌంటెంట్: కామర్స్‌లో డిగ్రీ
- జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్: ఇంటర్/డిగ్రీ, కంప్యూటర్ టైపింగ్ నైపుణ్యం
- ల్యాబ్ అటెండెంట్ : 10వ తరగతి పాస్ + ల్యాబ్ సర్టిఫికేట్ లేదా 12th (సైన్స్)
వయోపరిమితి :
- ప్రిన్సిపల్: గరిష్ఠ వయస్సు – 50 సంవత్సరాలు
- పీజీటీ: గరిష్ఠ వయస్సు – 40 సంవత్సరాలు
- టీజీటీ, హోస్టల్ వార్డెన్, అకౌంటెంట్: గరిష్ఠ వయస్సు – 35 సంవత్సారాలు
- జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్: గరిష్ఠ వయస్సు – 30 సంవత్సరాలు
అన్ని కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం, గడువు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 23- 2025 రాత్రి 11:50 వరకు అవకాశం కలదు.
అప్లికేషన్ ఫీజు :
- ప్రిన్సిపాల్ : 2500/-
- పీజీటీ/టీజీటీ : 2000/-
- నాన్ టీఛింగ్ స్టాఫ్ : 1500/-
- (Women, SC, ST, PwBD : 500/-)
పరీక్షల తేదీలు , అడ్మిట్ కార్డ్స్ విడుదల తేదీలు తరువాత తెలియజేయబడుతుంది
ఎంపిక విధానం : ప్రతి పోస్టుకు – 2 దశల్లో పరీక్ష (Preliminary, Main) & ఒకదశ వైవా/ఇంటర్వ్యూ (ప్రిన్సిపల్ కి మాత్రమే) ఉంటుంది.
పూర్తి నోటిఫికేషన్ : Download Pdf
వెబ్సైట్ : official website