BIKKI NEWS (JUNE 1) : EHS Latest Updates. ఉద్యోగ, ఉపాధ్యాయ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో హెల్త్ కార్డ్ పథకంపై నేడు గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు గారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
EHS Latest Updates
3 రోజుల్లో ట్రస్ట్ (Governing Body) ను నియమించడం జరుగుతుంది.
7 రోజుల్లో పూర్తి స్థాయి సమగ్ర హెల్త్ గైడ్‌లైన్స్ (రెఫరల్ ఆసుపత్రుల జాబితా, చికిత్సల జాబితా తదితర వివరాలు) విడుదల చేయబడతాయి.
10 రోజుల్లో హెల్త్ కార్డ్ పథకాన్ని ఆసుపత్రుల్లో నగదు రహిత (Cashless) చికిత్స విధానంలో అమలు చేస్తాము.
ప్రతి నెల 1వ తేదీన వేతనాలు జమ అయిన రోజున ప్రభుత్వ వాటాను ట్రస్ట్ ఖాతాలో జమ చేస్తాము.
ఈ నెల 10వ తేదీ నుంచి పథకం అమలుకు అనుగుణంగా ప్రీమియం డిడక్షన్ ప్రారంభించడం జరిగింది.
హెల్త్ గైడ్‌లైన్స్ రూపకల్పనలో 2013లో జారీ చేసిన EHS ఉత్తర్వులు G.O.Ms.No.174, 175, 176 మరియు వాటి కొనసాగింపుగా 2017లో జారీ చేసిన G.O.Ms.No.97, 98లను పరిశీలించి, దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మరింత మెరుగైన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను అమలు చేస్తాము.
CPS ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం తమ ఇష్టానుసారం ఈ పథకంలో కొనసాగవచ్చు. కొనసాగదలచిన వారు త్రైమాసికం (Quarterly), అర్ధ వార్షికం (Half-Yearly) లేదా వార్షిక (Yearly) ప్రాతిపదికన ముందస్తుగా చలానా ద్వారా చందా చెల్లించాల్సి ఉంటుంది.
సంఘాల ప్రతినిధులు సూచించిన ఇతర అంశాలు, వినతులు మరియు ప్రతిపాదనలను కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాము.
