BIKKI NEWS (June 29) : EHS Deduction GO MS No 79. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
EHS Deduction GO MS No 79
ఈ ఉత్తర్వులు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రాథమిక వేతనం/ప్రాథమిక పెన్షన్‌లో 1.5% చొప్పున EHS నిధికి చందా మినహాయించబడుతుంది.
ఈ మినహాయింపు మే–2026 జీతం/పెన్షన్ (జూన్–2026 చెల్లింపుల నుంచి) అమల్లోకి వస్తుంది మరియు తదుపరి ప్రతి నెల కొనసాగుతుంది.
ఉద్యోగులు, పెన్షనర్లు చెల్లించే చందాకు ప్రభుత్వం సమాన మొత్తాన్ని (Matching Contribution) EHS ట్రస్ట్‌కు అందిస్తుంది.
మినహాయించిన మొత్తం ప్రత్యేక Employees Health Scheme Fund ఖాతాలో జమ చేయబడుతుంది.
భార్యాభర్తలు ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే లేదా ఒకరు ప్రభుత్వ ఉద్యోగి, మరొకరు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ అయితే లేదా ఒకే పెన్షనర్‌కు సర్వీస్ పెన్షన్ తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా వస్తున్నట్లయితే ఒక్కరి నుంచే 1.5% EHS చందా మినహాయించాలి.
డీడీఓలు (DDOs) IFMIS- HRMSలో ఉద్యోగి/జీవిత భాగస్వామి వివరాలను ధృవీకరించి రెండు సార్లు చందా మినహాయింపు జరగకుండా చర్యలు తీసుకోవాలి.
పొరపాటున రెండుసార్లు చందా మినహాయించినట్లయితే, అదనంగా మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలి (Refund) అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

