BIKKI NEWS : Eggs for Govt junior college students. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పోషకాహారం అందించడంలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు కోడిగుడ్లు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్ అభిలాష అభినవ్ నిర్ణయం తీసుకున్నారు.
Eggs for Govt junior college students
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వారంలో మూడుసార్లు ఉడకబెట్టిన కోడిగుడ్లు అందించనున్నట్లు సమాచారం. విద్యార్థులకు అవసరమైన పోషకాలు అందించడంతో పాటు, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
ఒక్కో గుడ్డుకు రూ.6 చొప్పున చెల్లింపు
ఈ కార్యక్రమం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా అమలులో చేయనున్నారు . ఒక్కో కోడిగుడ్డుకు రూ.6 చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుంది.
విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం
ఇంటర్మీడియట్ విద్యార్థులు చదువుల ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వారికి పోషకాహారం అందించడం ఎంతో కీలకం. కోడిగుడ్లలో ప్రోటీన్‌తో పాటు ఇతర పోషకాలు ఉండటంతో విద్యార్థుల ఆరోగ్యానికి ఇవి ఉపయోగపడతాయి.

