- BIKKI NEWS : 12 JAN 2026
DISTRICTS REORGANIZATION IN TELANGANA SAYS CM REVANTH. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
DISTRICTS REORGANIZATION IN TELANGANA SAYS CM REVANTH.
గత ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పారదర్శకత పాటించలేదని, అస్తవ్యస్తంగా ఇష్టమొచ్చినట్లు జిల్లాలో పెంపు చేపట్టిందని టీజీవోస్ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో వ్యాఖ్యానించారు.

మండలాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది జనాభా ప్రాతిపదికన చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇందుకోసం కమిషన్ ఏర్పాటు చేసి, ప్రజల నుండి అభ్యంతరాలను, సూచనలను స్వీకరించి వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాలలో దీనిపై కూలంకషంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఒక్కో జిల్లాలో భారీగా జనాభా ఉందని మరికొన్నిటిలో తక్కువ జనాభా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
జిల్లాలు, మండలాల సంఖ్యను పెంచడం, తగ్గించడం మీద కాకుండా జనాభా పరంగా సమానంగా ఉండేలా పునర్వ్యవస్థీకరణ చేపట్టడంపైనే తమ దృష్టి ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలియజేశారు.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

