DASARA HOLIDAYS – దసరా సెలవులు పొడిగింపు

BIKKI NEWS (SEP. 19) : Dasara holidays in andhra pradesh extended. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.

Dasara holidays in andhra pradesh extended

అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉండగా… తాజా నిర్ణయంతో ఇవి సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు ఉండనున్నాయి.

దీంతో విద్యార్థులకు మరో రెండు రోజులపాటు దసరా సెలవులు ఎక్కువగా రానున్నాయి.

తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులు సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు కలవు. సాంకేతిక విద్య శాఖలో సెప్టెంబర్ 25 నుంచి , ఇంటర్మీడియట్ విద్యా శాఖలో సెప్టెంబర్ 28 నుండి దసరా సెలవులు కలవు.