BIKKI NEWS : Daily GK bits in telugu part 140 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
Daily GK bits in telugu part 140 for compititive exams
1) ఏ శిలీంద్రాలు యాంటీబయోటిక్స్ కు మూలం.?
జ : పెన్సిలియం
2) భారతదేశ మొత్తం వైశాల్యంలో తుఫానుల ముప్పుకు గురయ్యే ప్రాంతం ఎంత శాతం.?
జ : ఎనిమిది శాతం
3) భారతదేశ మొత్తం వైశాల్యంలో ఎంత శాతం కరువువకు గురవుతుంది.?
జ : 68%
4) భారతదేశంలో నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది.?
జ : 1974
5) మైదాన ప్రాంతాలలో 33 శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని ఏ అటవీ విధానము ద్వారా పేర్కొనబడింది.?
జ : జాతీయ అటవీ విధానం – 1988
6) ఎలక్ట్రిక్ బల్బ్ లలో ఉండే వాయువు ఏది.?
జ : నైట్రోజన్
7) ఎలక్ట్రిక్ హీటర్ లో ఉపయోగించే పదార్థం ఏది.?
జ : నిక్రోమ్
8) విద్యుత్ విశ్లేష్య సిద్దాంతాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : ఫారడే
9) కృత్రిమ ఉపగ్రహాలకు విద్యుత్ శక్తి ఆధారం ఏది.?
జ : సౌర విద్యుత్ ఘటం
10) విద్యుత్ వలయంలో కెపాసిటర్ ను వాడటానికి కారణం ఏమిటి.?
జ :విద్యుత్ ను నిల్వ చేయడం
11) శాంతి నికేతన్ సంస్థను ప్రారంభించినది ఎవరు.?
జ : రవీంద్రనాథ్ ఠాగూర్
12) ఒక ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు సక్రమంగా నిర్వహించమని జారీ చేసే రిట్ ఏది.?
జ : మాండమస్
13) హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం ఎవరికి ఉంది.?
జ : సుప్రీం కోర్ట్
14) భారత రాజ్యాంగం ప్రకారం ఎంతమంది రాజ్యసభ సభ్యులను రాష్ట్రపతి నామినేట్ చేయవచ్చు.?
జ : 12
15) ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో సమానత్వాన్ని పాటించాలని సూచించే ఆర్టికల్ ఏది?
జ : ఆర్టికల్ 16
16) భారతదేశం వెలుపల నివసించే నిర్దిష్ట వ్యక్తుల పౌరసత్వ హక్కులను సూచించే ఆర్టికల్ ఏది?
జ : ఆర్టికల్ 8
17) భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులను సూచించే ఆర్టికల్ ఏది?
జ : 51 (A)
18) గంగానది ఏ ప్రాంతంలో పర్వతాల నుండి మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది.?
జ : హరిద్వార్
19) భారతదేశంలోని పశ్చిమ తీరంలోని దక్షిణ భాగాన్ని ఏ తీరం అని పిలుస్తారు.?
జ : మలబార్ తీరం
20) సట్లెజ్ మరియు కాళీ నదుల మధ్య ఉన్న హిమాలయాలను ఏ హిమాలయాలు అంటారు.?
జ : కుమావోన్
21) సరిస్కా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : రాజస్థాన్
22) నీటిలోని సేంద్రియ పదార్థాల పరిమాణాన్ని తెలిపే అంశం ఏది.?
జ : బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్
23) ఇనుప రేకులు తుప్పు పట్టకుండా పూతపూసే లోహం.?
జ : జింకు
24) వంటసోడా రసాయన నామం ఏమిటి.?
జ : సోడియం బై కార్బోనేట్
25) అల్యూమినియం ముఖ్య ఖనిజం.?
జ : బాక్సైట్
26) టేబుల్ షుగర్ ఒక.?
జ : సుక్రోజ్
27) బేలూన్ లలో నింపే వాయువు ఏది.?
జ : హీలియం
28) సముద్రం నీటి నుండి ఉప్పు ను వేరు చేసే ప్రక్రియ.?
జ : ఇగర్చడం
29) లాతూరు భూకంపం సంభవించిన తేదీ.?
జ : 1993 సెప్టెంబర్ 30
30) సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (CSWCRTI) ఎక్కడ ఉంది.?
జ : డెహ్రాడూన్
