Gk bits by bikki news

DAILY GK BITS IN TELUGU PART 131- జీకే బిట్స్

హైదరాబాద్ : DAILY GK BITS IN TELUGU PART 131. పోటీ పరీక్షలకు డైలీ జీకే బిట్స్.

DAILY GK BITS IN TELUGU PART 131

1) రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే ఆర్టికల్ 356 ను చివరి అస్థ్రంగా మాత్రమే వినియోగించాలని, దీన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయాలని ఏ కమిషన్ సిఫారసు చేసింది.?
జ : రాజ్యాంగ పునః సమీక్ష కమిషన్

2) రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని ఏ ఆర్టికల్ వివరిస్తుంది.?
జ : ఆర్టికల్ 61

3) రాష్ట్రపతిని తొలగించే విధానాన్ని మన రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది.?
జ : అమెరికా

4) నెహ్రు 1954లో పంచశీల ఒప్పందాన్ని ఏ చైనా నాయకుడుతో కుదుర్చుకున్నారు.?
జ : చౌ ఎన్ లై

5) భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ఎప్పటినుండి అమల్లోకి వచ్చింది.?
జ : 1990 జనవరి 30

6) వాహన కాలుష్యం వలన ఆర్టికల్ 21 లో పేర్కొన్న జీవించే హక్కుకు భంగం వాటిల్లుతుందని ఏ నగరంలో డీజిల్ బస్సులను సిఎన్జీ బస్సులుగా మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.?
జ : న్యూఢిల్లీ

7) కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి ఉంటుంది.?
జ : రాష్ట్ర ప్రభుత్వం

8) సుప్రీం కోర్టు‌, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ఎవరు నిర్దేశిస్తారు.?
జ : పార్లమెంట్

9) రాజ్యసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో ఎన్నో వంతు మంది ప్రతి రెండేళ్లకోసారి పదవి విరమణ పొందగా వారి స్థానంలో కొత్త వారు ఎన్నికవుతారు.?
జ : 1/3 వ వంతు

10) లోక్ సభ ఆమోదించిన ఆర్థిక బిల్లులను రాజ్యసభకు పంపిన తర్వాత ఎన్ని రోజుల్లోగా ఆమోదం తప్పనిసరిగా తెలియజేయాలి.?
జ : 14 రోజులు

11) రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన ప్రాథమిక హక్కుల సలహా సంఘానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : సర్దార్ వల్లభాయ్ పటేల్

12) ఈ తరహా ప్రభుత్వాన్ని వెస్ట్ మినిస్టర్ పద్ధతిగా పేర్కొంటారు.?
జ : పార్లమెంటరీ తరహా

13) భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా అభివర్ణించింది ఎవరు?
జ : ఐవర్ జన్నింగ్

14) ప్రధానిగా పనిచేసి‌, ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగరవేయని ప్రధాని ఎవరు.?
జ : చంద్రశేఖర్

15) భారతీయ పౌరులందరూ వ్యాపార, వర్తక, వృత్తిని నిర్ణయించుకునే స్వేచ్ఛను తెలియజేస్తున్న ఆర్టికల్ ఏది.?
జ : ఆర్టికల్ 19 (1G)

16) ప్రపంచంలోనే తొలిసారిగా ఎన్నికల ప్రక్రియ ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కేరళలో ఎప్పుడు నంబూద్రి ప్రసాద్ ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేశారు.?
జ : 1959

17) జోనల్ కౌన్సిల్ ల సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు.?
జ : కేంద్ర హోం మంత్రి

18) వ్యవసాయతర భూములపై ఎస్టేట్ డ్యూటీని విధించే అధికారం ఎవరికి ఉంది.?
జ : కేంద్రం

19) మెట్రోఫాలిటన్ నగరంగా గుర్తించాలంటే ఎంతకు పైగా జనాభా ఉండాలి.?
జ : పది లక్షలు

20) పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ బద్ధత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పటినుండి అమల్లోకి వచ్చింది.?
జ : 1993 ఏప్రిల్ 24

21) రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఏర్పాటు చేస్తారు.?
జ : ఆర్టికల్ 243 (I)

22) భారత దేశంలో స్థానిక సుపరిపాలన సంస్థల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : లార్డ్ రిప్పన్

23) అలోహ ఆక్సైడ్ లను నీటిలో కరిగిస్తే ఏమి ఏర్పడును.?
జ : ఆమ్లాలు

24) శాతవాహన నిజమైన రాజ్య స్థాపకుడు ఎవరు.?
జ : మొదటి శాతకర్ణి

25) ఇందిరాసాగర్ ఆనకట్ట ను ఏ నదిపై నిర్మించారు.?
జ : నర్మద

26) పులిచింతల ప్రాజెక్టు ఏవరి పేరుతో నిర్మించారు.?
జ : కేఎల్ రావు

27) ఏపీలోని ఏ జిల్లాలో ఝంజావతి రబ్బరు డ్యాం ఉంది.?
జ : విజయనగరం

28) భారతదేశం లో అత్యంత ఎత్తైన ప్రాజెక్టు ఏది.?
జ : భాక్రా ప్రాజెక్టు

29) ప్రపంచంలో అతిపెద్ద రాతి కట్టడపు ఆనకట్ట ఏది.?
జ : నాగార్జున సాగర్

30) జాతీయ జల మండలిని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 1990

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →