- BIKKI NEWS : 22-01-2026
DAILY GK BITS 84 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
Daily GK BITS 84 for compititive exams
1) గాడిదల వన్యప్రాణి కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : ఎర్నాకులం కేరళ
2) హైదరాబాద్ నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్ ఎక్కడ ఉంది.?
జ : న్యూఢిల్లీ
3) తెలంగాణ చరిత్ర బిక్కవోలుగా పేర్కొన్న ప్రాంతం నేడు ఏ పేరుతో పిలుస్తున్నారు.?
జ: బికనూర్
4) హైదరాబాద్ షోలాపూర్ మధ్య ఏ సంవత్సరంలో రోడ్డు లైన్ వేశారు.?
జ : 1868
5) తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి .?
జ : 988
6) ఇండియన్ స్ట్రగుల్ అనే ఆత్మకథ ఎవరిది.?
జ : సుభాష్ చంద్రబోస్
7) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం స్థాపకుడు ఎవరు.?
జ : పండిట్ మదన్ మోహన్ మాలవ్య
8) తెలంగాణ రాష్ట్ర హస్త కళల అభివృద్ధి సంస్థ ట్రేడ్ మార్క్ ఏమిటి.?
జ : గోల్కొండ
9) నిజాం స్థాపించిన క్షయవ్యాధి చికిత్స కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : అనంతగిరి కొండలు
10) తెలంగాణలో మొదటి దళిత వార్తాపత్రిక పేరు ?
జ : పంచమ
11) మంచినీటి ఆవరణ వ్యవస్థను అధ్యయనం చేయు శాస్త్రము.?
జ : లిమ్నాలజీ
12) అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు న్యాయ పరిధిలోకి వస్తాయి.?
జ : కలకత్తా
13) ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు మన కళ్ళల్లో నీరు రావడానికి కారణం.?
జ : సైన్ ప్రొపనేథియల్ ఎస్ ఆక్సైడ్
14) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు .?
జ: ఏప్రిల్ 7
15) చంద్రయాన్ – 1 ప్రయోగించడానికి ఉపయోగించిన సాటిలైట్ వాహనము.?
జ : పీఎస్ఎల్వీ సి11
16) జనాభా లెక్కల నుండి మూడవ జెండర్ ను గణించడం ఎప్పటి నుంచి జరిగింది.?
జ : 2011 జనాభా లెక్కలు
17) అంగవైకల్యం గల వ్యక్తులకు సమాన అవకాశాలు, హక్కులను కల్పించాలని లక్ష్యంతో 2016 లో చేసిన చట్టం పేరేమిటి.?
జ : రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజెబిలిటీస్ బిల్లు 2016
18) వెనుకబడిన తరగతుల కమిషన్ అధ్యక్షురాలుగా కాకా కాలేల్కర్ నియామకం ఎప్పుడు జరిగింది.?
జ : 1953
19) తెలంగాణ (పూర్వపు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా) 1/ 70 చట్టం దేన్ని సూచిస్తుంది.?
జ : గిరిజనుల భూములు గిరిజనేతరులకు బదలాయించకుండా నివారించడం
20) నోట్ల రద్దు సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు.?
జ : ఉర్జిత్ పటేల్
21) “పార్లమెంటు సభ్యుని స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం” (PM LADS) ఏ ప్రధానమంత్రి ప్రారంభించారు.?
జ : పీవీ నరసింహారావు
22) భారత రాజ్యాంగానికి అర్ధ వివరణ (వ్యాఖ్యానం) తెలిపే అంతిమ అధికారం ఏ వ్యవస్థకు ఉంది.?
జ : సుప్రీంకోర్టు
23)నిజాం రాష్ట్ర రైల్వే, రోడ్డు రవాణా శాఖ మరియు సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారి బస్సుల నెంబర్ ప్లేట్ మీద ఉండే జెడ్ అక్షరం ఎవరికి సంబంధించినది.?
జ: జహ్రా బేగం
24) హైదరాబాదులో హుస్సేన్ సాగర్ దగ్గర ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ ప్రాంతంలో ఇంతకు మునుపు ఉన్నది ఏది?
జ : హుస్సేన్ సాగర్ థర్మల్ విద్యుత్ కేంద్రం
25) ముల్కీ నిబంధనలకు రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో కల్పించింది.?
జ : 1972
26) భారతీయ ముస్లిం లీగ్ ప్రచురించిన వార్తాపత్రిక పేరు.?
జ : స్టార్ ఆఫ్ ఇండియా
27) తొలి తెలుగు శాసనం వేయించిన రాజులు ఎవరు.?
జ : రేనాటి చోళులు
28) భారత రాష్ట్రపతి గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ వివరిస్తాయి.?
జ :ఆర్టికల్ 52 నుండి 62 వరకు
29) రాష్ట్రపతి ఎన్నిక విధానం ఏది.?
జ : నైష్పత్తిఠ ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ విధానం ద్వారా రహస్య ఓటింగ్
30) లీలావతి గ్రంథ రచయిత ఎవరు.?
జ : నేమి చంద్రుడు

