BIKKI NEWS : daily GK BITS 54 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
daily GK BITS 54 for compititive exams
1) నిజాం – హైదరాబాద్ రాష్ట్రంపై భారత ప్రభుత్వం ఏ తేదీన పోలీస్ చర్య చేపట్టింది .?
జ : 13 సెప్టెంబర్ 1948
2) “అమ్మ తెలంగాణామా ఆకలి కేకల గానమా” అనే ప్రఖ్యాత పాటను రాసినది ఎవరు.?
జ : గద్దర్
3) www యొక్క సంక్షిప్త రూపం ఏమిటి.?
జ : వరల్డ్ వైడ్ వెబ్
4) తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఎంతమంది రాజ్యసభ సభ్యులు కలరు.?
జ : ఏడుగురు
5) చేనేతకారుల జీవితాలను సులభం చేయడానికి ఒక యంత్రాన్ని కనిపెట్టిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎవరు.?
జ : ఎక్కా యాదగిరి రావు
6) చంద్రునిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా కాలు మోపిన సంవత్సరం ఏది?
జ : 1969
7) 1984లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందన్న వాస్తవాలను పరిశీలించడానికి నియమించబడిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు.?
జ : కె. జయభారత్ రెడ్డి
8) ఒక ఎకరం భూమికి ఎన్ని గుంటలు ఉంటాయి.?
జ : 40
9) మానవ పుర్రె లోని మొత్తం ఎముకల సంఖ్య ఎంత.?
జ : 22
10) రంగన్ తిట్టు పక్షి అభయారణ్యం గల రాష్ట్రం ఏది.?
జ : కర్ణాటక
11) జీ4 కూటమిలోని సభ్య దేశాలు ఏవి?
జ : భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్
12) దంతావాల కమిటీ దేనితో సంబంధం కలిగి ఉంది.?
జ : బ్లాక్ స్థాయి ప్రణాళిక
13) తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి ఎవరు పేరు పెట్టారు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ
14) పార్లమెంటులో ఏ సభలోను సభ్యత్వం లేకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్ గా వ్యవహరించేది ఎవరు?
జ : ఉపరాష్ట్రపతి
15) అర్థశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : ఆడం స్మిత్
16) మానవులలో సాధారణంగా కనిపించే అణుధార్మిక మూలకం ఏది?
జ : పొటాషియం – 40
17) లోయర్ మానేరు డ్యాం ఏ జిల్లాలో ఉంది.?
జ : కరీంనగర్
18) ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకుడు ఎవరు.?.
జ : నేతాజీ సుభాష్ చంద్రబోస్
19) వినోబా భావే తెలంగాణలో ప్రారంభించిన భూదాన ఉద్యమానికి మొదటిసారిగా భూమిని దానం చేసింది ఎవరు.?
జ : వెదిరె రామచంద్రారెడ్డి
20) తెలంగాణలో తొలి డిజిటల్ గ్రామం ఏది.?
జ : బాసర
21) డ్వాక్రా పథకాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది.?
జ : 1982
22) హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయాన్ని స్థాపించింది ఎవరు.?
జ : కొమర్రాజు లక్ష్మణరావు
23) నీలగిరి కొండల దక్షిణం వైపు గల పాస్ పేరు ఏమిటి?
జ : పాల్ ఘాట్
24) 1885 లో బొంబాయి లో జరిగిన మొదటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు .?
జ : డబ్ల్యూ సి బెనర్జీ
25) మానవ శరీరంలోని ప్రధాన రక్త సమూహాలను మొదటిసారిగా వేరు పరచిన శాస్త్రవేత్త ఎవరు?
జ : కార్ల్ ల్యాండ్ స్టీనర్
26) గిర్ గ్లాని కమిషన్ నియామక ఉద్దేశం ఏమిటి.?
జ : జీవో నెంబర్ 610 అమలుతీరు పరిశీలించుటకు
27) కొమురం భీం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది.?
జ : పెద్ద వాగు
28) ఆర్టికల్ 368 ప్రకారం ప్రాథమిక హక్కుల్ని పార్లమెంట్ సవరించరాదనే సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు ఏ తీర్పులో ప్రకటించింది .?
జ : గోలక్ నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్
29) ధనుష్కోడి అనేది వేటిని కలిపే కేంద్రము.?
జ : బంగాళాఖాతం & హిందూ మహాసముద్రం
30) భారత రాజ్యాంగంలో ‘హెబియస్ కార్పస్’ అని రిట్ ను జారీ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు.?
జ : సుప్రీంకోర్టు మరియు హైకోర్టు
- TG SSC EXAM DATES – తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- Holidays – విద్యా సంస్థలకు సెలవులు
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- TELANGANA HOLIDAYS 2026 – తెలంగాణలో సెలవుల లిస్టు
- Today in history – చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 08

