BIKKI NEWS : DAILY GK BITS 47 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
DAILY GK BITS 47 FOR COMPITITIVE EXAMS
1) 1922లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ‘రంప తిరుగుబాటుకు’ నాయకత్వం వహించింది ఎవరు.?
జ : అల్లూరి సీతారామరాజు
2) కాకతీయుల కాలంలో ‘మాచల దేవి’ అనే రాజ నర్తకి ఓరుగల్లు లో చిత్ర ప్రదర్శనశాలలు నెలకొల్పింది. అప్పటి కాకతీయ రాజు ఎవరు.?
జ : ప్రతాపరుద్ర దేవుడు
3)ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాష్ట్రపతికి వివిధ అత్యవసర పరిస్థితి ప్రకటనలను వివిధ కారణాల ద్వారా జారీ చేయు అధికారాన్ని ఇచ్చినది.?
జ : 38వ రాజ్యాంగ సవరణ చట్టం
4) ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరాన్ని ఏమని అంటారు.?
జ : అమ్మీటర్
5) 1864లో సికింద్రాబాద్ లో అబ్దుల్ ఖాదీర్ సంపాదకత్వంలో వెలువడిన మొట్టమొదటి ఆంగ్ల వార్త పత్రిక ఏది.?
జ : దక్కన్ టైమ్స్
6) తెలంగాణ జేఏసీ నేతృత్వంలో 2011 మార్చి 10న చేపట్టిన ప్రజా పోరాట ఉద్యమం ఏది.?
జ : మిలియన్ మార్చ్
7) 1985 డిసెంబర్ లో జారీ చేయబడిన జీవో నెంబర్ 610 ముఖ్యంగా ఏ శాఖలోని అసమానతలను తొలగించడానికి ఉద్దేశించబడినది.?
జ : ఉపాధి కల్పన శాఖ
8) “చందా రైలు పథకానికి’ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించి నిజాం ప్రభుత్వ ఆగ్రహానికి పాత్రుడైనది ఎవరు.?
జ : డాక్టర్ అఘోరనాథ చటోపాధ్యాయ
9) నిజాం సంస్థానంలో ‘జిల్లా బంది’ పద్ధతిని ప్రవేశపెట్టడానికి కారణం ఎవరు.?
జ : ఒకటవ సాలార్ జంగ్
10) హిందూ – ముస్లింల ఐక్యతకు సంకేతమైన “సదాకత్ ఆశ్రమాన్ని” స్థాపించినది ఎవరు.?
జ : మహాత్మా గాంధీ
11) కాకతీయ రాజా రుద్ర దేవ గొప్ప యోధుడని, చాళుక్య చోళ రాజైన రెండవ రాజరాజుకు సమకాలీకుడని ఏ శిలాశాసనంలో తెలుపబడినది.?.
జ : ద్రాక్షారామ శాసనం
12) భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది.?
జ : సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (CSO)
13) తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని ఎంత శాతానికి పెంచడానికి కృషి చేస్తుంది.?
జ : 33 శాతానికి
14) నానేఘాట్ శాసనం ప్రకారం మొదటి శాతకర్ణికి కలిగి ఉన్న బిరుదులు ఏవి.?
జ : అప్రతిహత చక్ర మరియు దక్షిణ పథాపతి
15) తెలంగాణలోని ‘మల్లెల తీర్థం జలపాతం’ ఎన్ని అడుగుల ఎత్తులో కలదు.?
జ : 200 అడుగులు
16) గంగా నది డెల్టా దేనికి ఉదాహరణ.?
జ : ఆర్కుయోట్ డెల్టా
17) భారత రాజ్యాంగ ఏడవ సవరణ దేనికి సంబంధించింది.?
జ : బాషా ప్రాతిపాదికతపై రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ
18) ‘తెలంగాణలో ఏం జరుగుతున్నది’ అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : ప్రొఫెసర్ జయశంకర్
19) తెలంగాణకు సంబంధించిన ‘నీళ్లు నిజాలు’ అనే పుస్తక రచయిత ఎవరు.?
జ : ఆర్. విద్యాసాగర్ రావు
20) ‘దగాపడ్డ తెలంగాణ’ పుస్తక రచయిత ఎవరు.?
జ : ఇన్నయ్య
21) భారతదేశంలో ఉన్న ఒకే ఒక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది.?
జ : భారెన్ ద్వీపం
22) గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సహకార పరపతి సంఘాల చట్టం – 1904 ద్వారా సహకార సంఘాల ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : లార్డ్ కర్జన్
23) తెలంగాణలో రైతు బీమా పథకంలో పేర్కొన్న ‘భీమా దావా పరిష్కారం కాలవ్యవధి’ ఎంత.?
జ : 10 రోజులలోపు
24) ‘సీరల్’ అన్నది తెలంగాణలోని ఏ తెగకు సంబంధించిన ముఖ్య పండుగ.?
జ : అంద్
25) బోగ్గు గనులలో విస్పోటనాలం ఏ రెండు పదార్థాల వల్ల కలుగుతాయి.?
జ : మీథేన్ మరియు బొగ్గు పొడి
26) QUAD గ్రూపులో సభ్య దేశాలు ఏవి.?
జ : అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్.
27) తెలంగాణలో కామదేవ్ ఆలయం ఎక్కడ ఉంది.?
జ : నార్నూర్ మండలం ఆదిలాబాద్
28) ఒగ్గు కథ అన్నది ఒగ్గు అనే పదము నుండి వచ్చినది. ఒగ్గు అంటే అర్థం ఏమిటి?
జ : శివుడుతో సంబంధం కలిగిన చిన్న వాయిద్యం
29) ఏ జాతి ఎలుగుబంటి 2050 నాటికి కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు.?
జ : హిమాలయ గోధుమ రంగు ఎలుగుబంటి
30) డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్, తెలంగాణ ప్రభుత్వం కలిసి రంగారెడ్డి జిల్లా మాడుగులలోని ఏ చారిత్రక ఆలయాన్ని పునరుద్ధరింపజేశారు.?
జ : శివాలయం

