DAILY GK BITS – 44 : జీకే బిట్స్

Gk bits

BIKKI NEWS : DAILY GK BITS – 44 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Daily Gk Bits – 44 for compititive exams

1) ఉత్తర భారతంలో ఏ చక్రవర్తి మరణానంతరం శాతవాహనులు రాజకీయంగా శక్తివంతులైనారు.? జ : అశోకుడు

2) భారతదేశంలో అత్యంత దక్షిణాన ఉన్న పౌర విమానాశ్రయం ఏది.?
జ : తిరువనంతపురం

3) గోదావరి నది వ్యవస్థ యొక్క అత్యంత తూర్పున ఉన్న ఉపనది ఏది.?
జ : శబరి

4) మార్బల్ (దువధర్ ఫాల్స్) జలపాతం గల నది ఏది.?
జ : నర్మదా

5) 1947 సెప్టెంబర్ రెండవ తేదీన జరిగిన పరకాల మారణ హోమం జలియన్ వాలాబిగ్ ఉదంతంతో పోల్చదగింది. పరకాల ఉద్యమకారుల ధ్యేయం ఏమిటి.?
జ : జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం

6) తెలంగాణ తల్లి విగ్రహానికి రూపు రేఖలను ఇచ్చినది ఎవరు.?
జ : బి వెంకట రమణాచారి

7) ‘నాగేటి సాలళ్ళ నా తెలంగాణ’ గేయ రచయిత ఎవరు.?
జ : నందిని సిదా రెడ్డి

8) ‘ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా’ పాట రచయిత ఎవరు.?
జ : అభినయ శ్రీనివాస్

9) చిల్లర దేవుళ్ళు అనే నవలను రచించినది ఎవరు?
జ : దాశరధి రంగాచార్య

10) తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది?
జ : పాలపిట్ట

11) రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జ : లూయిస్ పాశ్చర్

12) 23వ తీర్థంకరుడు అయిన పార్శ్వనాథుడు సూచించిన సూత్రం ఏది?
జ : బ్రహ్మచర్యము

13)కనిష్కుని కాలంలో సృజనాత్మకత కళలను సృష్టించిన ప్రముఖ గ్రీక్ ఇంజనీర్ ఎవరు.?
జ : ఎగిసిలస్

14) అన్ని గ్రహాలలోకెల్లా ప్రకాశవంతమైన గ్రహం ఏది?
జ : శుక్రుడు.

15) శాకరిన్ అనునది ఒక.?
జ : కృత్రిమ తీపి కారకం

16) 1924 లో రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేయబడింది. అట్టి ఏర్పాటుకు సిఫారసు చేసిన కమిటీ ఏది?
జ : ఆక్వర్ట్ కమిటీ

17) దక్కన్ ప్రాంత దండయాత్రల విజయ సూచికగా బులంద్ దర్వాజని ఏ మొఘల్ చక్రవర్తి నిర్మించాడు.?
జ : అక్బర్

18) రత్నగిరి అనే ఇనుప దాతు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : మహారాష్ట్ర

19) 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలలో అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల ప్రాంతం ఏది?
జ : డామన్ & డయ్యు

20) హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు యొక్క మొత్తం పొడవు ఎంత.?
జ : 158 కిలోమీటర్లు

21) భారత రాష్ట్రపతికి లేని వీటో అధికారం ఏది?
జ : అర్హతలతో కూడిన వీటో అధికారం లేదు

22) 1950లో హైదరాబాద్ రాష్ట్ర క్యాబినెట్ పరిపాలన, ఆర్థిక, రంగాలలో పునర్వ్యవస్థీకరణకై సలహాలను ఇచ్చుటకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు?
జ : ఏ డి గోల్ వాలా

23) 1852 – 53లలో “ఇడ్లీ సాంబార్ గో బ్యాక్” అనే నినాదంతో జరిగిన ముల్కీ ఉద్యమాన్ని ఎవరు నడిపించారు.?.
జ : విద్యార్థులు

24) ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయభారత్ రెడ్డిని త్రిసభ్య కమిటీకి కన్వీనర్ గా నియమించి తెలంగాణకు సంబంధించిన ఏ అంశంపై అధ్యయనం చేయమన్నారు.?
జ : ప్రభుత్వ ఉద్యోగుల లెక్కలు

25) తెలంగాణ జీవన విధానాన్ని తన చిత్రలేఖనాలతో ప్రతిబింబ చేసినవారు ఎవరు?
జ : కె లక్ష్మణ్ గౌడ్

26) తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేశారు.?
జ : జె.చొక్కారావు

27) విదేశీ పర్యాటకుడు చేత అతి గొప్ప సామ్రాజ్యాధిపతిగా కీర్తించబడిన రాష్ట్రకూట పాలకుడు ఎవరు.?
జ : అమోఘవర్మ

28) దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం పదిలక్షల జనాభా కంటే ఎక్కువ గల పట్టణాల సంఖ్య ఎంత.?
జ : 53

29) ప్రస్తుతం గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతంలో గల రాష్ట్రాల సంఖ్య ఎంత.?
జ : 8

30) హర్షవర్ధనుడు మోక్ష పరిషత్ ను ఎక్కడ ఏర్పాటు చేశాడు.?
జ : ప్రయాగ

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →