DAILY GK BITS 34 – జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS 34 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్ .

DAILY GK BITS 34 FOR COMPITITIVE EXAMS.

1) ఆరోగ్యవంతమైన మానవుడు ఏ అవధిలోని ధ్వని తరంగాలను మాత్రమే వినగలడు.?
జ : 20 నుంచి 20000 హెర్జ్‌లు

2) మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన భారతీయుడు ఎవరు?
జ : డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్

3) హర్షుడి కాలంలో భారత్ ను సందర్శించిన చైనా యాత్రికుడు ఎవరు.?
జ : హూయాన్ త్సాంగ్

4) రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ లో పేర్కొన్నారు.?
జ : ఆర్టికల్ 61

5) బుద్ధునికి జ్ఞానోదయం కలిగిన బోధ్ గయా ప్రదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : బీహార్

6) ఒక బైట్ (BYTES) కు ఎన్ని బిట్లు (BITS) సమానము.?
జ : 8

7) ఆంధ్ర కబీర్ అని ఎవరిని అంటారు.?
జ : యోగి వేమన

8) భారతదేశంలో మెట్రో రైలు మొట్టమొదటిసారిగా ప్రారంభించిన రాష్ట్రం ఏది?
జ : పశ్చిమబెంగాల్ – కలకత్తా

9) మాంసాహారుల్లో అవశేషా అవయువంగాను… శాకాహారుల్లో ఉపయోగపడే అవయంగా ఉండే అవయం ఏది?
జ : ఉండుకము (ఎపెండిక్స్)

10) శాఖాహార జీవులలో ఉండుకము ఏ ఆహార పదార్థాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది.?
జ : సెల్యూలోజ్

11) హ మానవునిలో ఏ గ్రంధి అదృశ్యం అవడం వలన ముసలితనం అనేది కలుగుతుంది.?
జ : థైమస్

12) అను రియాక్టర్ లలో న్యూట్రాన్ల వేగం తగ్గించడానికి ఉపయోగపడే రసాయనం ఏమిటి.?
జ : భార జలం (D₂O)

13) దేశంలో అత్యున్నత న్యాయాధికారి గా పిలవబడే అటార్నీ జనరల్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది.?
జ : 76

14) WHO కరోనా వైరస్ ను ప్రపంచ అత్యవసర పరిస్థితి గా ఏ రోజు ప్రకటించింది.?
జ : జనవరి – 30 – 2020

15) 1851 వరకు భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏది.?
జ: కోల్ కతా

16) ఒకే గర్భగుడిలో రెండు శివలింగాలను కలిగి ఉన్న దేవాలయము ఏది?
జ : కాళఘశ్వరం దేవాలయం (తెలంగాణ)

17) ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా నిలిచిన అంగర్ వాన్ కోట్ దేవాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు.?
జ : సూర్య వర్మ – 2

18) వరి మొక్క యొక్క శాస్త్రీయ నామం ఏమిటి.?
జ : ఒరైజా సెటైవా

19) క్లైమ్ ఫెల్టర్ సిండ్రోమ్ లో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత.?
జ : 47 (XXY)

20) టర్నర్స్ సిండ్రోమ్ లో ఉండే క్రోమోజోముల సంఖ్య ఎంత.?
జ : 45 (X)

21) మానవ దేహంలో అవశేష అవయవాల సంఖ్య ఎంత.?
జ : 180

22) దేశంలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు పేరు ఏమిటి?
జ: వివేక్ ఎక్స్‌ప్రెస్

23) ప్రపంచంలో అతి పురాతన ముడత పర్వతాలుగా వీటిని పేర్కొంటారు.?
జ : ఆరావళి పర్వతాలు

24) గాలిలో తేమ శాతాన్ని కొలుచు సాధనము ఏమిటి.?
జ : హైగ్రో మీటర్

25) అంతరిక్షంలోకి మానవుని పంపిన మొదటి దేశం ఏమిటి?
జ : రష్యా

26) సూర్య కుటుంబంలో అతిపెద్ద ఉపగ్రహం ఏది.?
జ : గనిమెడ

27) జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
జ : చార్లెస్ డార్విన్

28) కంటికి సంబంధించిన దూరద్రుష్టి లోపం ఉన్న వారికి ఉపయోగపడే కటకం ఏది.?
జ : కుంభకార కటకం

29) దాశరథి శతకం రచించినది ఎవరు.?
జ : కంచర్ల గోపన్న

30) భూమి పొరలలో అత్యధికంగా లభించే లోహం ఏది.?
జ : అల్యూమినియం