BIKKI NEWS : DAILY GK BITS 33 FOR COMPITITIVE EXAMS. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు డైలీ జీకే బిట్స్ .
DAILY GK BITS 33 FOR COMPITITIVE EXAMS.
1) పుస్తకార ఊపిరితిత్తులు కలిగి ఉన్న జీవి ఏది.?
జ : తేలు
2) రబ్బర్ వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగించే మూలకం ఏమిటి.?
జ : సల్ఫర్
3) ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది.?
జ : కాస్పియన్
4) వేసవి విడిది కేంద్రమైన డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : పశ్చిమ బెంగాల్
5) సీసాలలో తేమను గ్రహించడానికి వాడే రసాయనమేమిటి.?
జ : సిలికా జెల్
6) రిజర్వు బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్ప కాలిక రుణాలపై వడ్డీ రేటును ఏమని పిలుస్తారు.?
జ : రేపో రేటు
7) విద్యా హక్కు చట్టం ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది.?
జ : 2010 ఏప్రిల్ – 01 నుంచి
8) 2011 జనాభా లెక్కల కమిషనర్ ఎవరు.?
జ : డా. చంద్రమౌళి
9) మనం నివసిస్తున్న భూమి బల్లపరుపుగా కాదు గుండ్రంగా ఉందని మొదట చెప్పిన శాస్త్రజ్ఞుడు ఎవరు.?
జ : ఆరిస్టాటిల్
10) కాంతి తీవ్రతకు కొత్త ప్రమాణము ఏమిటి.?
జ : క్యాండేలా
11) టెలిగ్రాఫ్ లలో ఉపయోగించే కోడ్ ఏమిటి?
జ : మోర్స్ కోడ్
12) న్యూట్రాన్ ఉండని ఏకైక మూలకం ఏది?
జ : హైడ్రోజన్
13) జపాన్ లో ‘మినీమటా’ అనే వ్యాధి ఏ లోహం వల్ల కల్గింది.?
జ : మెర్క్యురీ
14) కంటిలోని రెటీనా భాగాన్ని కెమెరాలోని ఏ భాగంతో పోలుస్తారు.?
జ : ఫిల్మ్
15) మానవ శరీరంలో అతి పెద్ద గ్రంధి ఏమిటి.?
జ : కాలేయము (లివర్)
16) ప్రపంచంలో అతిపెద్ద మరియు అతి లోతైన మహాసముద్రం ఏది.?
జ : పసిఫిక్ మహా సముద్రం
17) భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి చెందిన నృత్యం.?
జ : తమిళనాడు
18) ప్రపంచంలో అతి పొడవైన నైలునది ఏ ఖండంలో ఉంది.?
జ: ఆఫ్రికా ఖండం
19) హిమాలయ పర్వత పాదాల ప్రాంతంలో విసనకర్ర ఆకారంలో ఏర్పడిన సచిద్ర మండలాలను ఏమంటారు.?
జ : భాబర్
20) వాన పాములను ఉపయోగించి ఎరువుల తయారీ చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : వర్మీ కల్చర్
21) ఆహార వ్యవసాయ నోబెల్ బహుమతిగా అభివర్ణించే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను ఎవరు ప్రారంభించారు.?
జ : నార్మన్ బోర్లాగ్
22) ప్రపంచ యోగా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 21
23) ఇస్రో అంగారక గ్రహం అధ్యయనం కోసం చేపట్టిన కార్యక్రమం పేరు ఏమిటి?
జ : మంగళయాన్
24) డ్వాక్రా (Development of Women and Children in Rural Areas) పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు.?
జ : 1982
25) స్వాతంత్ర అనంతరం జాతీయాదాయాన్ని లెక్కించడానికి “జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని” ఎవరి అధ్యక్షుడిగా ఏర్పాటు చేశారు.?
జ : మహాలనోబిస్ (1949 లో)
26) హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది.?
జ : 1938
27) లోక్సభకు తొలి మహిళా స్పీకర్గా ఎవరు పనిచేశారు.?
జ : మీరా కుమార్
28) రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఎన్ని సంవత్సరాలు.?
జ : 6 సంవత్సరాలు
29) నీటిలో కిరోసిన్ చల్లడం ద్వారా దోమలు, కీటకాలను చంపే ప్రక్రియ ఏ నీటి భౌతిక ధర్మం మీద ఆధారపడి ఉంటుంది.?
జ : నీటి తలతన్యత
30) ఎడారిలో ఒయాసిస్సులు ఏ భౌతిక ధర్మం ఆధారంగా ఏర్పడతాయి.?
జ : కేశనాళికీయత