DAILY GK BITS 31 – డైలీ జీకే బిట్స్

BIKKI NEWS : DAILY GK BITS 31 FOR COMPITITIVE EXAMS – పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్

DAILY GK BITS 31 FOR COMPITITIVE EXAMS

1) ప్రపంచ జనాభా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూలై 11

2) భారతదేశంలో సన్ సిటీ అని దేన్ని పిలుస్తారు.?
జ : జోద్ పూర్

3) గరీబి హఠవో నినాదాన్ని ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇందిరా గాంధీ ఇచ్చారు.?
జ : నాలుగవ పంచవర్ష ప్రణాళిక

4) రెండవ అలెగ్జాండర్ గా పేరుపొందిన భారత సుల్తాన్ ఎవరు.?
జ : అల్లావుద్దీన్ ఖిల్జీ

5) ఇతర వెనుకబడిన తరగతులు(OBC) జాబితాను సొంతంగా సిద్ధం చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కట్టిపెట్టినందుకు ఉద్దేశించిన సవరణ చట్టం ఏది?
జ : 105 వ రాజ్యాంగ సవరణ చట్టం

6) హనుమాన్ చాలీసా, రామ చరిత మానస్ ను రచించిన కవి ఎవరు.?
జ : తులసీదాస్

7) 1556 లో రెండవ పానిపట్టి యుద్ధంలో హేమూ ను ఓడించింది ఎవరు?
జ : అక్బర్

8) మూక్ నాయక్, బహిష్కృత్ భారత్ (మరాఠీ) వంటి పత్రికలను ప్రారంభించినది ఎవరు.?
జ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

9) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆర్థిక సంఘం ఏర్పాటును సూచిస్తుంది.?
జ : 280

10) కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలలో ఉన్న అంశాలు ఎన్ని.?
జ : కేంద్రం : 100,
రాష్ట్రం : 61
ఉమ్మడి : 52

11) సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.?
జ : అక్టోబర్ – 12 – 2005

12) భగవద్గీత ను పర్షియన్ భాషలోకి అనువదించిన షాజహాన్ కుమారుడు ఎవరు.?
జ : దారాషుకో

13) కొల్లాజిన్ అనే ప్రోటీన్ తయారీ కి ఉపయోగకరమైన విటమిన్ ఏది.?
జ : విటమిన్ – C

14) భారతదేశంలో అధికార భాష గా ఉన్న రాష్ట్రం ఏది.?
జ : నాగాలాండ్

15) తెలంగాణ లో సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు.?
జ : వరంగల్

16) వందేమాతరం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది.?
జ : 1905

17) ‘ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా’ అనే గ్రంధాన్ని రచించినది ఎవరు? జ : మోక్షగుండం విశ్వేశ్వరయ్య

18) 1974 ప్రోఖ్రాన్ వద్ద ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిపిన అణు పరీక్షలకు పెట్టిన కోడ్ ఏమిటి.?
జ : స్మైలింగ్ బుద్ధ

19) సాదరణ మానవుడి శరీర ఉష్ణోగ్రత ఎంత.?
జ : 98.6°F

20) శరీరంలో అతిపెద్ద అవయవం ఏది.?
జ : చర్మం

21) వర్షపు చినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం ఏమిటి.?
జ : తలతన్యత ధర్మం

22) ఆహరంలో ఏ పదార్థం లోపం వలన గాయిటర్ వ్యాధి కలుగుతుంది.?
జ : అయోడిన్

23) న్యూక్లియర్ రియాక్టర్ ను కనుగొన్నది ఎవరు.?
జ : ఫెర్మి

24) పక్షులు ఎగరడంలో న్యూటన్ యొక్క ఎన్నో నియమం ఇమిడి ఉంది.?
జ : న్యూటన్ మూడో నియమం

25) ఏ సభను హౌస్ ఆఫ్ పీపుల్స్ అని అంటారు.?
జ : లోక్‌సభ

26) భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు.?
జ: అనిబీసెంట్

27) హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు.?
జ : అనిబీసెంట్

28) బ్రిటిష్ ఇండియాకు చివరి వైస్రాయ్ ఎవరు.?
జ : లార్డ్ మౌంట్ బాటన్

29) భూదానోద్యమం ఎవరు ప్రారంభించారు.?
జ : వినోబా భావే

30) బేస్ బాల్ క్రీడా ఆడే మైదానానికి గల పేరు ఏమిటి.?
జ : డైమండ్