DAILY GK BITS 30 – జీకే బిట్స్

Daily gk bits 30 - జీకే బిట్స్ - bikki news

BIKKI NEWS : DAILY GK BITS 30 FOR COMPITITIVE EXAMS – పోటీ పరీక్షల కొరకు డైలీ జీకే బిట్స్.

DAILY GK BITS 30 FOR COMPITITIVE EXAMS

1) సైనికదినోత్సవం(ఆర్మీ డే)ను ఎప్పుడు జరుపుకుంటారు .?
జ : జనవరి 15

2) ద్విదల బీజ కలుపు మొక్కల నివారణ కోసం ఉపయోగించే మందు ఏది.?
జ : 2,4- DNP

3) రక్తం గడ్డకట్టకుండా బ్లడ్ బ్యాంకులలో ఉపయోగించే కృత్రిమ రసాయనము ఏమిటి.?
జ : హెపారిన్

4) త్రిబుల్ యాన్టిజన్ అని ఏ వ్యాక్సిన్ ను అంటారు.? జ : డి పి టి (DPT)

5) వృక్ష సంబంధిత ఆహార ఉత్పత్తులలో లభించని విటమిన్ ఏది?
జ : B12

6) వాహనాలు నడిపే డ్రైవర్లు వెనుక నుండి వచ్చే వాహనాలను గమనించడానికి సైడ్ మిర్రర్ లో వాడే దర్పణం ఏది.?
జ : కుంభకార దర్పణం

7) అతినీలలోహిత కిరణాల (UV – RAYS) ఉనికిని ఏ గాజు ను ఉపయోగించి కనుగొంటారు.?
జ : క్వార్ట్జ్ గాజు

8) డైమండ్, గ్రాఫైట్, బోగ్గు లలో ఉండే రసాయన మూలకం ఏది.?
జ : కార్బన్ (C)

9) మానవుని పెద్ద ప్రేగులో సహజీవనం చేసే బాక్టీరియా ఏది.?
జ : ఔ – కొలై బాక్టీరియా

10) ఆగ్నేయాసియాలో 9.3 తీవ్రతతో, చరిత్రలో అతిపెద్ద సునామీ ఏ రోజు ఎర్పడింది.?
జ : డిసెంబర్ – 26 – 2004

11) అంతర్జాతీయ వాతావరణం సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది.?
జ : : జెనీవా (స్విట్జర్లాండ్)

12) లై డిటెక్టర్ పరీక్షలో ఉపయోగించే రసాయనం ఏది.?
జ : పెంటాథాల్

13) రెడ్ క్రాస్ సొసైటీని ఎవరు స్థాపించారు.?
జ : హెన్రీ డ్యూ నాంట్

14) శిలాజాల వయసును తెలుసుకునేందుకు ఉపయోగించే పద్ధతి ఏది?
జ : కార్బన్ డేటింగ్ ( C – 14)

15) సూర్యుడిలో జరిగే కేంద్రక చర్యలు ఏ రకమైనవి.?
జ : కేంద్రక సంలీన చర్యలు

16) మానవుని దంత సూత్రము ఏమిటి.?
జ : 2123/2123

17) బ్యాక్టీరియాలజీ పితామహుడు ఎవరు.?
జ : ఆంటోనీ వన్ లీవెన్ హుక్

18) మొక్కలు భూమి నుండి సేకరించిన నీటిలో ఎంత శాతాన్ని కిరణజన్య సంయోక్రియకు ఉపయోగించుకుంటాయి.?
జ : కేవలం రెండు శాతం

19) ఆపిల్ లో తినడానికి ఉపయోగపడే భాగం ఏమిటి.?
జ : పుష్పాసనం

20) 1945 ఆగస్టు 6న హీరోషిమాపై అమెరికా వేసిన ఆనుబాంబు పేరు ఏమిటి.?
జ : లిటిల్ బాయ్

21) 1945 ఆగస్టు 9న నాగసాకి పై అమెరికా చేసిన అణుబాంబు పేరు ఏమిటి?
జ : ఫ్యాట్ మాన్

22) సహజ విపత్తులు కేంద్రంలోని ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి.?
జ : కేంద్ర హోమ్ శాఖ

23) ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు.?
జ : భగత్ సింగ్

24) కిరణజన్య సంయోగ క్రియలో ఏ శక్తి ఏ శక్తిగా మారుతుంది.?
జ : కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది

25) ఏ సూత్రం ఆధారంగా విమానాలు, పారాచ్యూట్లు గాల్లో ఎగురుతాయి.?
జ : బెర్నౌలి సూత్రం

26) ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు.
జ : మాక్స్ ప్లాంక్

27) నిరంతర ప్రణాళికలను రూపొందించినది ఎవరు?
జ : గున్నార్ మిర్దాల్

28) సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.?
జ : 1963

29) జీఎస్టీ పన్నుల విధానం ఎప్పటినుండి అమల్లోకి వచ్చింది.? జ : జూలై 1 2017

30) భారతదేశంలో ఓటర్ల సంఖ్య దృష్ట్యా అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గం ఏది?
జ: మల్కాజ్ గిరి (తెలంగాణ)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →