CURRENT AFFAIRS AUGUST 21st 2025 – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : CURRENT AFFAIRS AUGUST 21st 2025 – కరెంట్ అఫైర్స్

CURRENT AFFAIRS AUGUST 21st 2025

1) కోట-బుండి (రాజస్థాన్) వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఎన్ని కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది?
జ: 1507.00 కోట్లు

2) కేంద్ర ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో “అన్నా-చక్ర” సరఫరా గొలుసు ఆప్టిమైజేషన్ పద్ధతిని అమలు చేసింది?
జ: 31 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు

3) కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఏ ఉద్యోగులకు “జాతీయ అనుభవ అవార్డులను” ప్రదానం చేశారు?
జ: పదవీ విరమణ చేశారు

4) వార్తాపత్రికలు మరియు మ్యాగజైన్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళీకృతం చేయడానికి ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (PRGI) ఇటీవల ఏ పోర్టల్‌ను ప్రారంభించింది?
జ: ప్రెస్ సర్వీస్ పోర్టల్

5) ఇటీవల మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
జ: మాణికా విశ్వకర్మ

6) సిన్సినాటి ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
జ: ఇగా స్వియాటెక్

7) గత పది సంవత్సరాలలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి ఎంతకు తగ్గినట్లు కేంద్రం ప్రకటించింది.?
జ : 18

8) తెలంగాణకు చెందిన ఎవరు రాసిన కవితను సీబీఎస్ఈ ఎనిమిదవ తరగతిలో పాఠంగా చేర్చారు.?
జ : రమేశ్ కార్తిక్ నాయక్ (చక్‌మక్)

9) 2024 – 25 ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర

10) 2024- 25 సంవత్సరం ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నో స్థానాల్లో ఉన్నాయి.?
జ : ఆరు, ఏడు

11) జీవులతో కూడిన ఏ బయో ఉపగ్రహాన్ని రష్యా ప్రయోగించింది.?
జ : బయాన్ ఎం – నెంబర్ – 2

12) ఏ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వడానికి కేంద్రం లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టింది.?
జ : జమ్మూ అండ్ కాశ్మీర్

13) ప్రజా ప్రతినిధులు 30 రోజులు దాటి జైల్లో ఉంటే పదవి తొలగించెందుకు సంబంధించిన ఏ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు.?
జ : 130 రాజ్యాంగ సవరణ బిల్లు

14) ఆన్లైన్ గేమింగ్ నిషేధం కొరకు లోక్ సభలో ప్రవేశపెట్టిన బిల్లు పేరు ఏమిటి.?
జ : ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025

15) ఆసియా క్రికెట్ కప్ 2025 ఆతిథ్యమిస్తున్న దేశం ఏది.?
జ : యూఏఈ

16) తాజాగా కేంద్ర ప్రభుత్వం అప్పు ఎంతకు చేరింది.?
జ : 200 లక్షల కోట్లు

17) ఏ సంవత్సరంలో చందమామ పైకి భారత్ వ్యొమోగామిని పంపాలని ఇస్రో నిర్ణయం తీసుకుంది .?
జ : 2040

18) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఏ పేరుతో ప్రారంభించారు.?
జ : స్త్రీ శక్తి పథకం

19) ప్రపంచంలో అత్యధిక రుణ భారమున్న దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : అమెరికా (37 లక్షల కోట్ల డాలర్లు)