HEAVY RAINS – భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కీలక ఆదేశాలు

BIKKI NEWS (SEP. 25) : CM Reventh Reddy orders on Rain alert in Telangana తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో, అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలర్ట్‌గా ఉండి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు.

CM Reventh Reddy orders on Rain alert in Telangana

అవసరమైన పక్షంలో, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.

అన్ని కాజ్‌వేలను పరిశీలించి, రోడ్లపై వరద నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందుగానే ట్రాఫిక్‌ను నిలిపివేయాలని సూచించారు.

విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. వేలాడుతున్న విద్యుత్ వైర్లను వెంటనే తొలగించి, ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.

దసరా సెలవులు ఉన్నప్పటికీ, విద్యా సంస్థలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దని సూచించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, హెచ్ఎండబ్ల్యూఎస్, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.