CBSE 10th and 12th Exam Time Table 2027 విడుదల

Cbse 10th and 12th exam time table 2027

BIKKI NEWS : CBSE 10th and 12th Exam Time Table 2027 . సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీల షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 6, 2026న విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం రెండు తరగతుల వార్షిక బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 16, 2027 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల పూర్తి టైమ్‌టేబుల్‌ను CBSE తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

ఫిబ్రవరి 16 నుంచి పదో తరగతి పరీక్షలు

CBSE విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పదో తరగతి బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 16, 2027న ప్రారంభమై మార్చి 9, 2027తో ముగియనున్నాయి.

CBSE 10th and 12th Exam Time Table 2027

తేదీసబ్జెక్టు
ఫిబ్రవరి 16పెయింటింగ్
ఫిబ్రవరి 17మ్యాథమెటిక్స్ స్టాండర్డ్, బేసిక్
ఫిబ్రవరి 22సైన్స్
ఫిబ్రవరి 26ఇంగ్లిష్
మార్చి 4తెలుగు సహా ప్రాంతీయ భాషలు
మార్చి 8సోషల్ సైన్స్
మార్చి 9మ్యాథమెటిక్స్ అప్లైడ్ తదితర సబ్జెక్టులు

ఫిబ్రవరి 16 నుంచి ఇంటర్ (12వ తరగతి) పరీక్షలు

12వ తరగతి సీనియర్ సెకండరీ బోర్డు పరీక్షలు కూడా ఫిబ్రవరి 16, 2027న ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 9, 2027 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

CBSE 10th and 12th Exam Time Table 2027

తేదీసబ్జెక్టు
ఫిబ్రవరి 16ఫిజిక్స్
ఫిబ్రవరి 18ఫిజికల్ ఎడ్యుకేషన్
ఫిబ్రవరి 20కెమిస్ట్రీ
ఫిబ్రవరి 23అకౌంటెన్సీ
ఫిబ్రవరి 25జాగ్రఫీ
ఫిబ్రవరి 27బయాలజీ
మార్చి 3తెలుగు సహా ప్రాంతీయ భాషలు
మార్చి 9మ్యాథమెటిక్స్
మార్చి 11హోమ్ సైన్స్
మార్చి 12టైపోగ్రఫీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్
మార్చి 18మార్కెటింగ్
మార్చి 20ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఏప్రిల్ 9వెబ్ అప్లికేషన్

గమనిక: ఇవి ముఖ్యమైన సబ్జెక్టుల తేదీలు మాత్రమే. పూర్తి సబ్జెక్టుల వారీ పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక PDFలో పరిశీలించాలి.

పరీక్షల సమయాలు ఇవే..

CBSE అధికారిక ప్రకటన ప్రకారం పరీక్షలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. కొన్ని పరీక్షలు మధ్యాహ్నం 12:30 గంటలకు ముగియగా, మరికొన్ని పరీక్షలు మధ్యాహ్నం 1:30 గంటలకు ముగుస్తాయి. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులో పేర్కొన్న సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

విద్యార్థులకు CBSE సూచనలు

  • పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన సూచనలు ప్రత్యేకంగా జారీ చేస్తారు.
  • అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనలను చదవాలి.
  • CBSE జారీ చేసిన అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.
  • పరీక్షా కేంద్రంలో ఎలాంటి కమ్యూనికేషన్ పరికరాలకు అనుమతి లేదు.

పూర్తి పరీక్షల షెడ్యూల్ PDF డౌన్‌లోడ్

విద్యార్థులు 10వ తరగతి, 12వ తరగతులకు సంబంధించిన పూర్తి సబ్జెక్టుల వారీ పరీక్షల తేదీలను CBSE విడుదల చేసిన అధికారిక PDFలో చూడవచ్చు.

CBSE 10th and 12th Exam Time Table 2027 PDF file

అధికారిక వెబ్‌సైట్: https://www.cbse.gov.in/

విద్యార్థులకు ముఖ్యమైన సూచన: పరీక్షల షెడ్యూల్‌ను ముందుగానే పరిశీలించి సబ్జెక్టుల వారీగా చదువుకునే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →