Kallem - ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు - bikki news

KALLEM – ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

KALLEM (APRIL 05) : Babu Jagjjivan Ram Jayanti in Kallem Village. కళ్ళెం గ్రామం లో ఈరోజు సమసమాజం కోసం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయులు,ఉప ప్రధాన మంత్రి, కేంద్ర కార్మికశాఖ, రక్షణ శాఖ వంటి పదవులు చేపట్టినా మహా మేధావి డా. బాబు జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి వేడుకలు దళితరత్న మబ్బు పరశురామ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి కూడలి వద్ద నిర్వహించడం జరిగింది.

Babu Jagjjivan Ram Jayanti in Kallem Village

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండ శోభ చంద్రమౌళి గారు, ఉప సర్పంచ్ ఆరె సంపత్ గారు, జీడికల్ దేవస్థానం ఛైర్మన్ ఏల మూర్తి గారు పాల్గొని డా. బాబు జగ్జీవన్ రామ్ గారికి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరూ ఆ మహానీయుని సేవలు మరువలేనివి, మనం అందరం ఆ మహానీయులు పోరాటాలను ప్రజలకు తెలియజేస్తూ మన కళ్ళెం గ్రామం అందరి మహానీయుల విగ్రహాలు పెట్టి భావి తరాలకు మన గ్రామ ఐక్యమైత్య చరిత్రను అందించాలని మాట్లాడటం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మార్పు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు మబ్బు రమేష్, మబ్బు మల్లేష్, నక్కీర్త మహేష్, మబ్బు కరుణాకర్, బాల్నే శేఖర్, కొత్త పేట భాస్కర్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మబ్బు క్రాంతి కుమార్,MRPS గ్రామ శాఖ అధ్యక్షుడు మబ్బు కన్నయ్య, ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ సలహా దారులు తాటిపాముల మల్లేష్, స్నేహ యూత్ అధ్యక్షుడు తిప్పారపు ప్రసాద్, జై భీమ్ ఫౌండేషన్ అధ్యక్షుడు మబ్బు విజయ్, పూలే యువజన సంఘం నాయకులు, మహాజన యూత్ అసోసియేషన్ సభ్యులు మరియు విద్యావంతులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ పుర ప్రముఖులు అందరూ పాల్గొని ఆ మహానీయుని‌కి నివాళులు అర్పించడం జరిగింది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →