AIIMS JOBS – 3501 ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (JULY 21) : AIIMS JOBS 2025 CRE NOTIFICATION. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3,501 పోస్టులను భర్తీ చేయనుంది.

AIIMS JOBS 2025 CRE NOTIFICATION

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రెగ్యులర్ ప్రాదిపాదికన నాన్ ఫ్యాకల్టీ గ్రూప్ – బి, గ్రూప్ – సి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బిఎస్సి, ఎంఎస్సీ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, డి ఎం ఎల్ టి, బి ఎం ఎల్ టి, బి ఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : పోస్టును అనుసరించి 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి . (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ,టైపింగ్ టెస్ట్ ఇతర పరీక్షల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.

రాత పరీక్ష తేదీ : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఆగస్టు 25, 26వ తేదీల్లో నిర్వహించనున్నారు.

స్టీల్ టెస్ట్ పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు

వెబ్సైట్ : www.aiimsexams.ac.in