BIKKI NEWS (June 28) : Agniveer Vayu 2027 notification. భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు (02/ 2027) ఖాళీల భర్తీకీ ఐఏఎఫ్ ఆన్‍లైన్ దరఖాస్తులు కోరుతోంది.
Agniveer Vayu 2027 notification
అర్హులైన అవివాహిత (Unmarried) యువతీ యువకుల నుంచి ‘అగ్నివీర్ వాయు 02/2027’ బ్యాచ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా 06 జూలై నుండి 26 జూలై 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు :
- సైన్స్ సబ్జెక్ట్స్ (Science Subjects): ఇంటర్మీడియట్ (మాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్) లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% మార్కులు తప్పనిసరి (లేదా)
- 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా( మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్స్ ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కనీసం 50% మార్కులతో పాస్ అయి ఉండాలి.
- ఇతర సబ్జెక్ట్స్ (Other than Science): ఏదైనా గ్రూపులో ఇంటర్మీడియట్ కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్టులో 50% మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి :
- అభ్యర్థులు 01 జూలై 2005 నుండి 01 జనవరి 2010 మధ్య జన్మించి ఉండాలి (ఈ రెండు తేదీలు కూడా కలుపుకుని).కనీస వయస్సు 17.5 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 22 సంవత్సరాలు.
శారీరక కొలతలు :
- ఎత్తు (పురుషులు): కనీసం 152.5 సెం.మీ ఉండాలి.
- ఎత్తు (మహిళలు): కనీసం 152 సెం.మీ ఉండాలి.
- ఛాతీ: గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
దరఖాస్తు ఫీజు :
- అభ్యర్థులందరికీ రూ. 550/- + 18% GST (ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలి).
వేతన వివరాలు:
- మొదటి సంవత్సరం నెలకు రూ. 30,000/- తో ప్రారంభమై, నాల్గవ సంవత్సరానికి రూ. 40,000/- వరకు ఇస్తారు.
- సర్వీస్ కాలపరిమితి 4 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- ఆన్‌లైన్ రాత పరీక్ష (CBT)
- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)
- అడాప్టబిలిటీ టెస్ట్స్ (I & II)
- మెడికల్ ఎగ్జామినేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 22 & 23 సెప్టెంబర్ 2026
Online Application Link (From 6th July)

