- BIKKI NEWS : 20-01-2026
TG TET 2026 KEY ON JANUARY 30th. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెట్ 2026 ప్రాథమిక కీ ని జనవరి 30న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
TG TET 2026 KEY ON JANUARY 30th
జనవరి 3న ప్రారంభమైన టెట్ పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిశాయి.
ఈసారి భారీ స్థాయిలో అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరయ్యారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ పరీక్షకు హాజరయ్యారు.
టెట్ పరీక్షలకి మొత్తంగా 82% హాజరు.. ఇన్ సర్వీస్ టీచర్లు 90%, నిరుద్యోగులు 78% హాజరు
జనవరి 3 నుండి జరిగిన టెట్ పరీక్షలు 20 వ తేదీ తో ముగిసాయి. టెట్ ప్రాథమిక కీ ఈ నెల 30 న విడుదల కానున్నాయి.జనవరి 30,31, ఫిబ్రవరి 1 వ తేదీల్లో (3 రోజులు) కీ పై ఆన్ లైన్ ద్వారా అభ్యంతరాల స్వీకరణ తీసుకోనున్నారు.
గతం లో టెట్ ఆన్ లైన్ పరీక్షలు ముగిసిన 2 రోజుల్లో ప్రాథమిక కీ విడుదల కాగా ఇప్పుడు కొంత ఆలస్యంగా 10 రోజులకు విడుదల కానున్నాయి.. ప్రాథమిక కీ తో పాటే అభ్యర్థుల టెట్ రెస్పాన్స్ షీట్స్ విడుదల కానున్నాయి.
టెట్ కి మొత్తంగా 237754 అప్లికేషన్స్ రాగా 195181 మంది హాజరు అయ్యారు.42573 మంది గైర్వాజరు అయ్యారు.
ఇన్ సర్వీస్ టీచర్లు 90% హాజరు.. టెట్ కి ఇన్ సర్వీస్ టీచర్లు 72673 మంది అప్లై చేయగా వీరిలో 65605 మంది హాజరు అయ్యారు. ఇక నిరుద్యోగులు 78% హాజరు అయ్యారు.165081 మంది అభ్యర్థులు అప్లై చేయగా 129576 మంది హాజరు అయ్యారు.
మొత్తంగా టెట్ పేపర్ 1 కి 85538 మంది అప్లై చేయగా 71198 మంది హాజరు అయ్యారు. ఇక టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగం లో 86413 అప్లై చేయగా 69861 మంది హాజరు అయ్యారు. టెట్ పేపర్ 2 సోషల్ విభాగం లో 65803 మంది అప్లై చేయగా 54122 మంది హాజరు అయ్యారు.
ప్రాథమిక కీ విడుదల చేసిన తరువాత అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించి తుదికి మరియు ఫలితాలను విడుదల చేయనున్నారు.
TG TET 2026 WEBSITE LINK
- Today current affairs in Telugu May 12th 2026 – కరెంట్ అఫైర్స్
- Daily current affairs in Telugu May 11th 2026 – కరెంట్ అఫైర్స్
- Top current affairs 10th May 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Today Gold Rate June 14th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- TG ICET 2026 Results విడుదల, ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి

