- BIKKI NEWS (2026 JAN. 10) :
stop usage of Almont kid syrup by TGDCA. తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘అల్మాంట్-కిడ్ సిరప్’ లో ప్రమాదకరమైన ఎథిలిన్ గ్లైకాల్ (Ethylene Glycol) కలిసినట్టు ల్యాబ్ పరీక్షల్లో నిర్ధారణ కావడంతో, ఆ సిరప్ వినియోగాన్ని వెంటనే నిలిపివేయాలని సూచించింది.
stop usage of Almont kid syrup by TGDCA
కల్తీగా తేలిన సిరప్ వివరాలు
- సిరప్ పేరు: అల్మాంట్-కిడ్ (Levocetirizine & Montelukast Syrup)
- బ్యాచ్ నెంబర్: AL-24002
- తయారీ తేది: జనవరి 2025
- గడువు తేది: డిసెంబర్ 2026
- తయారీదారు: ట్రిడస్ రెమెడీస్, హాజీపూర్, వైశాలి జిల్లా, బిహార్
Read this alao – ఈ దగ్గు సిరప్ లు డేంజరస్
ఎందుకు ప్రమాదకరం.?
ఎథిలిన్ గ్లైకాల్ అనేది అత్యంత విషపూరిత రసాయనం. ఇది ముఖ్యంగా:
- కిడ్నీలకు తీవ్రమైన నష్టం
- నరాల వ్యవస్థపై ప్రభావం
- పిల్లల్లో ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం
కావున ఈ సిరప్ వాడకం తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
ప్రజలకు అధికారుల సూచనలు
మీ వద్ద పై బ్యాచ్‌కు చెందిన అల్మాంట్-కిడ్ సిరప్ ఉంటే వెంటనే వాడకం ఆపాలి. దగ్గరలోని డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలి
టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-6969 కు ఫిర్యాదు చేయవచ్చు (సోమవారం–శుక్రవారం, ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు)
వైద్య దుకాణాలు & ఆసుపత్రులకు ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడికల్ షాపులు, హోల్‌సేలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఆసుపత్రులు ఈ బ్యాచ్‌కు చెందిన సిరప్‌ను తక్షణమే నిల్వల నుంచి తొలగించి, విక్రయించకుండా ఫ్రీజ్ చేయాలని DCA ఆదేశాలు జారీ చేసింది.
కఠిన చర్యలు
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఘటనపై కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజారోగ్యానికి ముప్పు లేకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించింది.

