BIKKI NEWS (DEC. 14) : SARPANCH APPOINTED DAY DECEMBER 20th 2025. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలకు డిసెంబర్ 20 నుంచి కొత్త సర్పంచ్లు, గ్రామ పంచాయతీ పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టాలని అపాయింటెడ్ డేను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
SARPANCH APPOINTED DAY DECEMBER 20th 2025
మూడు విడతల్లో ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గాలన్నీ డిసెంబర్ 20వ తేదీన ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఆ రోజు
డిసెంబర్ 20 నుంచి కొత్త పాలక వర్గాలు కొలువుదీరి, 5 సంవత్సరాల కాలపరిమితి పాటు కొనసాగనున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా, వివిధ కారణాలతో 21 గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మరికొన్నిటిపై కోర్టు స్టే ఉండగా, మిగిలిన దాదాపు 12,700 గ్రామ పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు ఏర్పడనున్నాయి.
కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన అనంతరం కేంద్ర ఆర్థిక సంఘం, కేంద్ర పంచాయతీరాజ్ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. పాలకవర్గాలు లేకపోవడంతో ఇప్పటివరకు నిలిపివేసిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరనుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో పెండింగ్ నిధులతో పాటు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్ నిధులు విడుదలయ్యే అవకాశముందని సమాచారం.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
