నెలరోజులు హాజరు కాకుంటే ఉద్యోగం ఊస్టింగ్ - bikki news

నెలరోజులు హాజరు కాకుంటే ఉద్యోగం ఊస్టింగ్

BIKKI NEWS (DEC. 02) : Unauthorised absent teachers removal from service. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు చెప్పా పెట్టకుండా, అధికారికంగా సెలవు పత్రం ఇవ్వకుండా విధులకు నెల రోజులపాటు గైర్హాజరైతే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

Unauthorised absent teachers removal from service

ఉపాధ్యాయులు నెలరోజులపాటు అనుమతి లేకుండా విధులకు హాజరు కాకుంటే షోకాజ్‌ నోటీసు జారీ చేసి, విచారణ జరిపి, ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గెజిట్‌లో ప్రచురించాలని డీఈఓలకు సూచించారు.

వాస్తవానికి ఒక రోజు అనధికారికంగా పాఠశాలకు రాకున్నా చర్యలు తీసుకోవచ్చని.. కాకపోతే అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడ్డానని, రోడ్డు ప్రమాదానికి గురయ్యానని ఇలా ఏదో ఒక సాకు చూపి కోర్టుల్లో కేసులు వేస్తారన్న చర్చ జరిగింది. దాంతో నెల రోజులు చూసి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని చెప్పారు.

రెండేళ్లలో 50 మంది తొలగింపు

ఏటా కొందరు టీచర్లు దీర్ఘకాలిక సెలవులపై వెళ్తుంటారు. అలాంటి వారు ఎక్కువగా విదేశాల్లోని తమ పిల్లలు, భాగస్వాముల వద్దకు వెళ్తారు. ఆరు నెలలని అనుమతి తీసుకొని ఒకటి, రెండేళ్లైనా విధులకు రాని వారున్నారు. అలాంటి వారిని గత రెండేళ్లలో సుమారు 50 మందిని ఉద్యోగం నుంచి తొలగించామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

ఇలా దీర్ఘకాలికంగా విధులకు హాజరు కానివారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, ఉద్యోగం నుంచి తొలగించే చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →