Regularization - కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించండి - హైకోర్టు - bikki news

Regularization – కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్దీకరించండి – హైకోర్టు

BIKKI NEWS (NOV. 06) : High court orders for regularization of contract lecturers in ap. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో 2007 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న లెక్చరర్లు తమ సేవలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలైన రిట్ పిటిషన్ పై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

High court orders for regularization of contract lecturers in ap

పిటిషనర్ల వాదన ప్రకారం, 2023 అక్టోబర్ 20న ప్రభుత్వం విడుదల చేసిన ‘ఏపీ రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్ట్’ ప్రకారం తమ రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయలేదని తెలిపారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ప్రకారం, “పిటిషనర్ల రెగ్యులరైజేషన్ ప్రతిపాదనలను, ఏపీ రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాక్ట్, 2023 ప్రకారం, ఆరు నెలల్లోగా విచారణ చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని” ఆదేశాలు జారీ చేశారు.

ఈ తీర్పుతో ఉన్నత విద్యా శాఖలో పనిచేస్తున్న అనేకమంది కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఊరటనిచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన సంగతి తెలిసిందే.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →