BRAOU – డిజిటల్ యూనివర్సిటీ గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

BIKKI NEWS (OCT. 02) : BR AMBEDKAR OPEN UNIVERSITY Now Digital University. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని డిజిటల్ యూనివర్సిటీగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

BR AMBEDKAR OPEN UNIVERSITY Now Digital University

విద్యార్థులు చదువుకునేందుకు, తరగతులకు హాజరయ్యేందుకు, ప్రాక్టికల్ పరీక్షలకు మినహా విద్యార్థులు హైదరాబాద్ వచ్చే అవసరం లేకుండా అంతా డిజిటలీకరణ చేస్తున్నారు.

ఇందులో భాగంగా పీఎం-ఉష పథకం కింద రూ.10 కోట్లతో డిజిటల్ రిసోర్స్ సెంటర్ ను, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.20 కోట్లతో… సమీకృత లెర్నింగ్ సెంటర్ ను, నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

వివిధ సమస్యలతో చదువును మధ్యలోనే వదిలేసిన గోండులు, చెంచులు, కోయలు మొదలైన ఆదివాసీ యువతకు అంబేడ్కర్ వర్సిటీ ఉచితంగా దూరవిద్యను అందిస్తోంది.

ఇంటర్ అర్హత ఉన్న దివ్యాంగులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉంటున్న దివ్యాంగులకు వారికి సమీపంలోనే స్టడీ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ట్రాన్స్ జెండర్లు యూట్యూబ్ పాఠాల లింకులను పంపుతున్నారు. ట్రాన్స్ జెండర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు కొందరు ఆచార్యులకు బాధ్యతలు అప్పగించారు.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK