BIKKI NEWS (SEP. 23) : KGBV REGULAR RECRUITMENT ISSUE. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేజీబీవీ లలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, గెస్ట్ పద్ధతిలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి విద్యా బోధన చేపట్టడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
KGBV REGULAR RECRUITMENT ISSUE
ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల శాఖకు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 25న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కారణంగానే కేజీబీవీ లలో శాశ్వత ప్రాతిపదిక నియామకాలు చేపట్టలేకపోతున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యశాఖ తరఫున వాదన వినిపించిన న్యాయవాది తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కేజీబీవీ లలో ప్రతి సంవత్సరం తాత్కాలిక పద్ధతిలోనే నియామకాలు భర్తూ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఇది విధానపరమైన నిర్ణయమని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ కార్యదర్శి తో మాట్లాడి కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు.