BIKKI NEWS (SEP. 21) : H1B VISA FEES 1 LAKH DOLLARS ONE TIME ONLY. అమెరికా హెచ్-1బీ వీసా దరఖాస్తు వార్షిక ఫీజు 1 లక్ష డాలర్లను ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన అవసరం లేదు. అది కూడా నూతనంగా వీసా పొందేందుకు మాత్రమే.
H1B VISA FEES 1 LAKH DOLLARS ONE TIME ONLY
సీనియర్ అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ట్రంప్ ప్రకటించిన కొత్త ఫీజు కేవలం కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.
ప్రస్తుత హెచ్-1బీ వీసాదారులకు లేదా రెన్యువల్ కు వర్తించదని స్పష్టం చేశారు.
ఇప్పటికే హెచ్-1బీ వీసా కలిగినవారు ఎటువంటి ఆందోళనకు గురికావలసిన అవసరం లేదన్నారు. వీరు ప్రస్తుతం విదేశాల్లో లేదా భారత దేశంలో ఉన్నప్పటికీ ఆందోళన అవసరం లేదని వివరించారు.
కొత్త నిబంధన అమల్లోకి రావడానికి ముందే అమెరికాకు తిరిగి చేరుకోవాలనే ఆందోళన అక్కర్లేదని చెప్పారు.
అయితే హెచ్-1బీ వీసా దరఖాస్తుల వార్షిక రుసుమును 1 లక్ష డాలర్లకు పెంచడం వల్ల డిగ్రీ, పీజీ చదివిన విద్యార్థులు మన దేశం నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే వారిపైనా ప్రభావం పడనుంది.