GROUP 2 RESULTS – ఈ వారమే గ్రూప్ 2 ఫలితాలు

BIKKI NEWS (SEP. 26) : TGPSC GROUP 2 FINAL RESULTS. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 తుది ఫలితాల వెల్లడించడానికి సమాయత్తం అవుతుంది. దసరా లోపే అనగా వారంలోనే ఈ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

TGPSC GROUP 2 FINAL RESULTS

మొత్తం 783 పోస్టులకు గ్రూప్ 2 నిర్వహించి అభ్యర్థుల నుండి వెబ్ ఆప్షన్ లో కూడా తీసుకున్న సంగతి తెలిసిందే

మొత్తం మూడు దశలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి అవసరమైన పోస్టులకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది.

గ్రూప్ 1 ఫలితాల తర్వాత గ్రూప్ 2 ఫలితాలు వెల్లడించాలని భావించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రస్తుతం గ్రూప్ 1 కు ఫలితాలు విడుదల కావడంతో గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను వెల్లడించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.