Colleges bandh : నేటి నుండి కళాశాలల బంద్ పై సందిగ్ధం

BIKKI NEWS (SEP. 15) : Colleges bandh today onwards in Telangana. తెలంగాణ రాష్ట్రంలో వృత్తి విద్య కళాశాలను (ఇంజనీరింగ్, ఫార్మా, MBA, B.Ed, PG & డిగ్రీ కళాశాలలు) ఈరోజు నుండి బంద్ చేస్తామని ఉన్నత విద్య కళాశాలల సమాఖ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

Colleges bandh today onwards in Telangana

ఈ నేపథ్యంలో ఆదివారం ఉన్నత విద్య కళాశాలల సమాఖ్యతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితాలను సోమవారం ప్రకటిస్తామని తెలిపారు. ఉన్నత విద్య కళాశాలల సమాఖ్య సానుకూలంగా స్పందించాలని బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క కోరారు.

అయితే ఉన్నత విద్య కళాశాలల సమాఖ్య మాత్రం ఇంతవరకు బంద్ ఉపసంహరణకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో బంద్ ఉంటుందా, లేదా అనేది సందిగ్ధంగా మారింది.

మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3.00 గంటలకు మరోసారి ఇరు వర్గాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.