BIKKI NEWS (SEP. 14) : INDIA vs PAKISTAN MATCH TODAY IN ASIA CUP. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ జట్లు ఈరోజు ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో తలపడుతున్నాయి.
INDIA vs PAKISTAN MATCH TODAY IN ASIA CUP
మరోవైపు ఈ మ్యాచ్ పై ఇప్పటికే దేశవ్యాప్తంగా నిరసనలు పలు రాజకీయ పార్టీలు మరియు సోషల్ మీడియా లో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తో ఎలాంటి సంబంధాలకు భారత పౌరులు ఇష్టపడడం లేదు.
అయితే ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ లో లైవ్ ప్రసారం కానుంది.
ఇప్పటివరకు ఆసియా కప్ లో టీట్వంటీ ఫార్మాట్ లో రెండు సార్లు తలపడగా చెరో విజయం సాధించాయి.
మరోవైపు మొత్తం మీద 13 సార్లు టీట్వంటీ లలో తలపడగా 10 భారత్, 3 పాకిస్థాన్ గెలిచాయి.
భారత జట్టు అంచనా : అభిషేక్, గిల్, సూర్యకుమార్, తింక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్థాన్ జట్టు అంచనా : సాహిబ్ జాదా ఫర్హాన్, సయమ్ ఆయూజ్, మహ్మద్ హారిష్, పకార్ జమాన్, సల్మాన్ అఘా, హసన్ నవాజీ, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అప్రాప్, షహీన్ ఆఫ్రిది, సుఫియాన్ ములీమ్, అబ్రార్ అహ్మద్.