Non Teaching to Junior Lecturer Promotions in inter – 10% ప్రమోషన్స్ పై వివాదం

Non teaching to junior lecturer promotions in inter

​BIKKI NEWS (Nov. 23) : Non Teaching to Junior Lecturer Promotions in inter. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రమోషన్ల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి (నాన్ టీచింగ్ స్టాఫ్) అర్హతలతో సంబంధం లేకుండా యథేచ్ఛగా జూనియర్ లెక్చరర్లుగా (జేఎల్) పదోన్నతులు కల్పిస్తుండటం వివాదానికి దారితీస్తోంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Non Teaching to Junior Lecturer Promotions in inter

​కనీస బోధన అనుభవం, సబ్జెక్టులపై పట్టు లేని వారు సైతం సీనియర్ లెక్చరర్లుగా చలామణి అవుతుండటంపై అధ్యాపక వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అంతకుముందు వారు కేవలం ఉద్యోగం చేశారే తప్ప, విద్యార్థులకు క్లాసులు చెప్పే పరిస్థితులు ఉండటం లేదని, ఇది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

​302, 223 జీవోల నిబంధనలకు పాతర? అసలు వివాదం ఇక్కడే!

​ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్‌కు సంబంధించి 1993 డిసెంబర్ 30న జారీ చేసిన జీవో నం. 302 ప్రకారం జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీలో కింది నిష్పత్తిని నిర్ణయించారు:

  • ​50 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా.
  • ​40 శాతం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల ద్వారా.
  • ​మిగిలిన 10 శాతాన్ని ఇతర విద్యాలయ ఉద్యోగుల ద్వారా భర్తీ చేసే విధానం ఉండేది.

​తర్వాతి కాలంలో జీవో నం. 223 ద్వారా రూల్-3ని సవరించి, జూనియర్ లెక్చరర్ పోస్టులలో 90 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు, మిగిలిన 10 శాతాన్ని మినిస్ట్రీరియల్ స్టాఫ్ (సూపరింటెండెంట్లు-3%, సీనియర్ అసిస్టెంట్లు-3%, స్టెనోలు-3%, జూనియర్ అసిస్టెంట్లు/స్టోర్ కీపర్లు-4%) కి కేటాయించారు.

​కానీ, ఈ సవరణ తర్వాత నేటి వరకు ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, కేవలం కాంట్రాక్ట్ అధ్యాపకులు, కారుణ్య నియామకాలతోనే కాలం నెట్టుకొస్తూ ఇంటర్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నాన్ టీచింగ్ కోటాకు దక్కే 10 శాతం కంటే అధికంగా అక్రమ పద్ధతిలో పదోన్నతులు ఇస్తూ వాస్తవ నియమాలను కాలరాస్తున్నారని అధ్యాపక సంఘాలు వాపోతున్నాయి.

​అధ్యాపకుల సీనియారిటీకి గండి.. బోధనపై ప్రభావం

​జూనియర్ కాలేజీల్లో కొనసాగుతున్న నాన్ టీచింగ్ క్లర్కులను కూడా అడ్డగోలుగా జేఎల్‌గా ప్రమోట్ చేస్తుండటంపై రెగ్యులర్ అధ్యాపకులు మండిపడుతున్నారు. కారుణ్య నియామకాల ద్వారా వస్తున్న వారు ఏదో ఒక కోర్సు ద్వారా సంపాదించిన పీజీ సర్టిఫికెట్ ఆధారంగా లెక్చరర్ కొలువులు దక్కించుకుంటున్నారు.

  • ​ఎన్సీటీఈ గైడ్‌లైన్స్ ప్రకారం అర్హతలు: జేఎల్ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ, టెట్/నెట్/సెట్ (TET/NET/SET) కలిగి ఉండాలి.
  • ​నియమాలను తుంగలో తొక్కి: అయితే ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా, కేవలం నాన్ టీచింగ్ సీనియారిటీని చూపిస్తూ అర్హత లేని వారికి ప్రమోషన్లు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
  • ​అనుభవం ఉన్నవారికి అన్యాయం: విషయ పరిజ్ఞానం లేని బోధనేతర సిబ్బంది లెక్చరర్లుగా మారి, సీనియారిటీ జాబితాలో ముందు వరుసలోకి రావడం వల్ల దీర్ఘకాలంగా పనిచేస్తున్న అనుభవజ్ఞులైన రెగ్యులర్ లెక్చరర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.
​Non Teaching to Junior Lecturer Promotions in inter – ఇప్పటివరకు రెండే రెండు సార్లు నియామకాలు!

​రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం రెండు సార్లు మాత్రమే శాశ్వత లెక్చరర్ల నియామకాలు జరిగాయి. నిబంధనల ప్రకారం.. కొత్త నియామకాలు జరిగినప్పుడు మాత్రమే అందులో 10 శాతం కోటాను నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతుల ద్వారా కేటాయించాల్సి ఉంటుంది. అంటే, కొత్త నియామకాలు జరిగితేనే ఈ 10 శాతం కోటా అమలులోకి రావాలి.

​కానీ, అధికారుల అండదండలతో రిక్రూట్‌మెంట్‌తో సంబంధం లేకుండా నిరంతరాయంగా ఈ 10 శాతం కోటా కింద పదోన్నతులు కల్పిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇది అభ్యర్థుల సీనియారిటీని, ప్రమోషన్లను దెబ్బతీయడమే కాకుండా ఇంటర్ చదువుతున్న విద్యార్థుల ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పదోన్నతులపై సమీక్ష జరపాలని అధ్యాపక వర్గాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

SOURCE : దిశ డైలీ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →