BIKKI NEWS (Nov. 21) : TG High Court on Hostel Welfare Officer Recruitment. వసతి గృహ సంక్షేమాధికారుల (Hostel Welfare Officers – HWO) పోస్టుల భర్తీ ప్రక్రియలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీఈడీ (B.Ed.) పరీక్షా ఫలితాలను వెల్లడించినప్పటికీ, సాంకేతిక జాప్యం వల్ల వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదన్న కారణంతో అర్హులైన అభ్యర్థులను తిరస్కరించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
TG High Court on Hostel Welfare Officer Recruitment
2025 మార్చి 17న విడుదల చేసిన ప్రొవిజనల్ ఎంపిక జాబితాను (Provisional Selection List) అభ్యర్థుల అర్హతల ఆధారంగా 4 వారాల్లోగా సవరించి తిరిగి విడుదల చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ను ఆదేశిస్తూ జస్టిస్ కె. శరత్ తీర్పు ఇచ్చారు.
TG High Court on Hostel Welfare Officer Recruitment – కేసు నేపథ్యం & హైకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు
గిరిజన సంక్షేమ శాఖ, ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టుల భర్తీలో నోటిఫికేషన్ తర్వాత ఫలితాలు వెల్లడించారన్న కారణంతో తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఎం. రాహుల్ తదితరులు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కింది కీలక వ్యాఖ్యలు చేసింది:
also read : విద్యా శాఖపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
- ఫలితాల వెల్లడి తేదీనే పరిగణించాలి: బీఈడీ ఫలితాలను వెల్లడించిన తేదీని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, సాంకేతిక కారణాలతో వెబ్సైట్లో అప్లోడ్ ఆలస్యం కావడం అభ్యర్థుల తప్పు కాదని కోర్టు స్పష్టం చేసింది.
- నోటిఫికేషన్ నాటికే అర్హత: ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 23న జారీ కాగా, బీఈడీ ఫలితాలు అంతకంటే ముందే అంటే డిసెంబర్ 21నే ప్రకటించారని కోర్టు గుర్తుచేసింది. కాబట్టి పిటిషనర్లు నోటిఫికేషన్ నాటికే పూర్తి అర్హత సాధించినట్లేనని పేర్కొంది.
- TGPSCకి 4 వారాల గడువు: ఈ నేపథ్యంలో గిరిజన, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, గ్రేడ్-2 పోస్టుల భర్తీకి 2025 మార్చి 17న జారీ చేసిన ప్రొవిజనల్ ఎంపిక జాబితాను అర్హతల ఆధారంగా 4 వారాల్లోగా సవరించి విడుదల చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది.

