IBPS 13217 JOBS – గ్రామీణ బ్యాంక్ లలో భారీ నోటిఫికేషన్

BIKKI NEWS (SEP. 22) : IBPS RRB 13217 Jobs notification. ఐబీపీఎస్ గ్రామీణ బ్యాంకులలో 13,217 ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ లో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

IBPS RRB 13217 Jobs notification

పోస్టుల వివరాలు

  • గ్రూప్ “A” : ఆఫీసర్లు (Scale I, II & III)
  • గ్రూప్ “B” : ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్)

దరఖాస్తు విధానం & గడువు: ఆన్‌లైన్ ద్వారా 01-09-2025 నుండి 28-09-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి : (01.09.2025 నాటికి)

  • ఆఫీస్ అసిస్టెంట్లు: 18 – 28 ఏళ్లు,
  • ఆఫీసర్ స్కేల్-I: 18 – 30 ఏళ్లు
  • ఆఫీసర్ స్కేల్-II: 21 – 32 ఏళ్లు
  • ఆఫీసర్ స్కేల్-III: 21 – 40 ఏళ్లు మద్య ఉండాలి. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.)

విద్యార్హతలు :

ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టీపర్పస్): బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా విభాగంలో + స్థానిక భాషలో ప్రావీణ్యం + కంప్యూటర్ పరిజ్ఞానం కావాలి.

ఆఫీసర్ స్కేల్-I: బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, లా, ఎకానమిక్స్, ఐటీ వంటి విభాగాలకు ప్రాధాన్యం) + స్థానిక భాష పరిజ్ఞానం.

ఆఫీసర్ స్కేల్-II & III: కనీసం 50% మార్కులతో డిగ్రీ + సంబంధిత ఫీల్డ్‌లో అనుభవం (2–5 సంవత్సరాలు అవసరం).

దరఖాస్తు ఫీజు : SC / ST / PwBD / ESM: ₹175/- రూపాయలు (ఇతరులందరూ: ₹850/-)

ఎంపిక విధానం :

ఆఫీస్ అసిస్టెంట్లు & ఆఫీసర్ స్కేల్-I: ప్రిలిమినరీ పరీక్ష + మెయిన్స్ (అసిస్టెంట్స్‌కి ఇంటర్వ్యూ లేదు, ఆఫీసర్లకు ఇంటర్వ్యూ ఉంటుంది).

ఆఫీసర్ స్కేల్-II & III: సింగిల్ ఆన్‌లైన్ ఎగ్జామ్ + ఇంటర్వ్యూ.

పరీక్ష తేదీలు (తాత్కాలికం)

  • ప్రిలిమినరీ పరీక్షలు : నవంబర్ / డిసెంబర్ 2025
  • మెయిన్ / సింగిల్ ఎగ్జామ్: డిసెంబర్ 2025 – ఫిబ్రవరి 2026
  • ఇంటర్వ్యూలు (ఆఫీసర్లు): జనవరి / ఫిబ్రవరి 2026

ఫలితాలు విడుదల : ఫిబ్రవరి / మార్చి 2026

పూర్తి నోటిఫికేషన్ : Download Pdf

వెబ్‌సైట్ : www.ibps.in