BIKKI NEWS (SEPM 01) : LIC GOLDEN JUBILEE SCHOLARSHIP 2025.
ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి గాను స్కాలర్‌షిప్‌ల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మూడు రకాల స్కాలర్‌షిప్ పథకాల కింద మొత్తం 11,200 మందికి ఆర్థిక సాయం అందించనున్నారు.
LIC GOLDEN JUBILEE SCHOLARSHIP 2025.
అర్హతలు:
2022-23, 2023-24 లేదా 2024-25 విద్యాసంవత్సరాలలో 10వ/12వ తరగతులు లేదా డిప్లొమా/ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
ఎంపికైన విద్యార్థులకు 2025-26 విద్యాసంవత్సరం నుంచి స్కాలర్‌షిప్ మంజూరు అవుతుంది.
స్కాలర్‌షిప్ వివరాలు:
గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు: మెడికల్, ఇంజనీరింగ్, డిప్లొమా తదితర ప్రొఫెషనల్ కోర్సులకు స్కాలర్‌షిప్‌లు.
ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రత్యేక వర్గాల విద్యార్థులు: 10+2 తర్వాత 11వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి తర్వాత ఐటీఐ/డిప్లొమా కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు.
దరఖాస్తు విధానం: ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 22, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ స్కాలర్‌షిప్ పథకాలు వెనుకబడిన విద్యార్థులకు ఉన్నత విద్య కొనసాగించేందుకు గొప్ప తోడ్పాటు అందిస్తాయని ఎల్ఐసి అధికారులు తెలిపారు.
వెబ్సైట్ : https://licindia.in