BIKKI NEWS : Current affairs 23rd September 2026 – కరెంట్ అఫైర్స్
Current affairs 23rd September 2026
1) ఇటీవల భారతదేశపు తొలి స్వదేశీ లాంగ్-రేంజ్ OWA డ్రోన్ ‘KAL’ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు?
జ : పోఖ్రాన్ రేంజ్
2) ఇటీవల సొంత అబ్జర్వేటరీని కలిగి ఉన్న దేశంలోని తొలి జాతీయ సాంకేతిక సంస్థ (NIT)గా ఏ సంస్థ వార్తల్లో నిలిచింది?
జ : NIT-శ్రీనగర్
3) ఇటీవల ISRO ‘ప్రాజెక్ట్ NETRA’ కింద అడ్వాన్స్‌డ్ రాడార్ రీసెర్చ్ ఫెసిలిటీకి ఈశాన్య రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో శంకుస్థాపన చేసింది?
జ : అసోంలోని చంద్రపూర్
4) ఇటీవల యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) 3వ జాతీయ సదస్సును ఎక్కడ ప్రారంభించారు?
జ : న్యూఢిల్లీ
5) ఇటీవల ‘కరం పండుగ’ను ఎక్కడ నిర్వహించారు?
జ : జార్ఖండ్
6) ఇటీవల 2026 ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా ఏ క్రీడలో స్వర్ణ పతకం సాధించింది?
జ : మహిళల క్రికెట్
7) ఇటీవల న్యూయార్క్‌లో తొలిసారిగా V4 + భారత్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. విసెగ్రాడ్ గ్రూప్ (V4)లోని దేశాలు ఏవి?
జ : పోలాండ్, హంగేరీ, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్
8) ఇటీవల 18వ భారత్–మంగోలియా సంయుక్త సైనిక విన్యాసం ‘నోమాడిక్ ఎలిఫెంట్ 2026’ ఎక్కడ ప్రారంభమైంది?
జ : ఉత్తరాఖండ్
9) ఇటీవల బంగాళాఖాతంలో ఏ తుపాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది?
జ : అర్ణబ్
10) 11వ ఆయుర్వేద దినోత్సవం–2026 జాతీయ వేడుకలు ఎక్కడ నిర్వహించనున్నారు?
జ : మహారాష్ట్ర
11) ఇటీవల అంతర్జాతీయ శాంతి దినోత్సవం–2026ను ఎప్పుడు నిర్వహించారు?
జ : సెప్టెంబర్ 21
12) ఇటీవల టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ప్లాట్‌ఫామ్ ప్రైజ్ 2026’ గెలుచుకున్న ‘Angh’ సినిమా ఏ ఈశాన్య రాష్ట్రానికి చెందినది?
జ : నాగాలాండ్
13) ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రి WWF గ్లోబల్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్‌ను ఎక్కడ ప్రారంభించారు?
జ : జైపూర్
14) ఇటీవల యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించిన ‘EU KIDS Act’ ప్రకారం ఎంత వయస్సు వరకు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడంపై పరిమితి విధించనున్నారు?
జ : 13 సంవత్సరాలు
15) గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఇండెక్స్ 40వ ఎడిషన్‌లో గుజరాత్‌లోని GIFT సిటీ ఏ ర్యాంక్ సాధించింది?
జ : 37వ స్థానం
16) ఇటీవల మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలోని దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ అభివృద్ధి కోసం ఒప్పందం చేసుకుంది?
జ : ఆంధ్రప్రదేశ్
17) ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026’ 9వ ఎడిషన్‌కు భాగస్వామ్య దేశాలుగా ఏ దేశాలను ఎంపిక చేశారు?
జ : జర్మనీ, నెదర్లాండ్స్
18) ఇటీవల మహిళల T20I క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనతను ఏ మహిళా క్రికెటర్ సాధించింది?
జ : స్మృతి మంధాన
19) ఇటీవల అదానీ పవర్ లిమిటెడ్ ఏ రాష్ట్రంలోని చాపర్‌లో 3,200 మెగావాట్ల అల్ట్రా-సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసింది?
జ : అసోం
20) ఇటీవల మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో దేశానికి తొలి కాంస్య పతకాన్ని ఎవరు సాధించారు?
జ : సుచికా తరియాల్

