BIKKI NEWS : Standard GK bits in Telugu part 177
Standard GK bits in Telugu part 177
1) హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి ఎవరు.?
జ : బూర్గుల రామకృష్ణారావు
2) స్వామి రామానంద తీర్థ గ్రామీణ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది.?
జ ; పోచంపల్లి
3) పెద్ద మనుషుల ఒప్పందంపై ఎంత మంది నాయకులు సంతకం చేశారు.?
జ : 8 మంది
4) హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది.?
జ : 1938
5) ‘ఆణా కథలు’ ఎవరి రచన.?
జ : కాళోజీ నారాయణరావు
6) ‘వొడవని ముచ్చట్లు’ ఎవరి రచన.?
జ : కొంపల్లి వెంకట గౌడ్
7) తొలి తెలుగు దండకావ్యం బోగిని దండకం ఎవరు రచించారు.?
జ : బమ్మెర పోతన
8) కాళోజి నారాయణరావు ఖలీల్ జీబ్రాన్ రచించిన ది ప్రాఫెట్ తెలుగులోకి ఏ పేరుతో అనువదించి సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నారు.?
జ : జీవన గీతం
9) సి నారాయణ రెడ్డి రచించిన ఏ కవితా సంకలనానికి జ్ఞానపీఠ్ అవార్డును 1988లో పొందారు.?
జ : విశ్వంభర
10) బెంగాల్ విభజనను ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు.?
జ : లార్డ్ కర్జన్
11) జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన తేదీ.?
జ : 1919 – ఎప్రిల్ 13
12) 196వ సంవత్సరంలో ముస్లిం లీగ్ను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.?
జ : ఢాకా
13) కృష్ణా పత్రిక స్థాపించిన సంవత్సరం ఏది.?
జ : 1902
14) ధూమ్ ధామ్ మొదటి ప్రదర్శన తెలంగాణలోని ఏ పట్టణంలో నిర్వహించారు.?
జ : కామారెడ్డి (2002 సెప్టెంబర్ 30)
15) ఉక్కు అనే మిశ్రమ లోహం ఏ లోహాల కలయిక వల్ల ఏర్పడుతుంది.?
జ : ఇనుము + కార్బన్ + మాంగనీస్
16) సిన్నబార్ అనేది ఏ లోహం యొక్క ప్రధాన ధాతువు.?
జ : మెర్క్యూరీ
17) పోలో ఆడుతు గుర్రంపై నుండి పడి మరణించిన సుల్తాన్ ఎవరు.?
జ : కుతుబుద్దీన్ ఐబక్
18) మురుగునుంచి ఉత్పత్తి అయ్యే వ్యాధికారకాలు ఏవి.?
జ : బాక్టీరియా, ప్రోటోజోవా
19) మానవుడు కనిపెట్టిన మొదటి కృత్రిమ మూలకం ఏది.?
జ : టెక్నీషియం
20) లోహలకు రాజుగా ఏ మూలకాన్ని పిలుస్తారు.?
జ : బంగారం
21) అరచేతిలో పెట్టుకుంటే కరిగిపోయే మూలకం ఏది.?
జ : గాలియం
22) ఆచార్య నాగార్జునుడు సంస్కృతంలో ఎన్ని గ్రంథాలు రాశాడు.?
జ : 24
23) ఇండియన్ ఐన్‌స్టీన్ అని ఎవరిని అంటారు.?
జ : ఆచార్య నాగార్జునుడు
24) బృహత్కత ను సంస్కృతంలోకి అనువదించినది ఎవరు.?
జ : దుర్విసుతుడు
25) ప్రకృతిలో లభించే సహజ బలమైన అయస్కాంతం ఏది.?
జ : నియో డైమియం
26) ఆక్సిజన్ అణువు ఏ అయస్కాంతత్వాన్ని కలిగి ఉంటుంది.?
జ : పారా అయస్కాంతము
27) విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది.?
జ : 2010
28) ద్రవ్య వినిమయ బిల్లును రాజ్య సభ ఎన్ని రోజులలో ఆమోదించాలి.?
జ : 14 రోజులు
29) రాజ్య సభలో రెండు సంవత్సరాల ఒకసారి ఎన్నో వంతు సభ్యులు పదవి విరమణ చేస్తారు.?
జ : 1/3వ వంతు
30) తెలంగాణలో లోక్ సభ స్థానాల సంఖ్య ఎంత.?
జ : 17

