BIKKI NEWS : Standard GK bits in Telugu part 174. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్ రౌండప్.
Standard GK bits in Telugu part 174
1) ప్రపంచ సంతోష నివేదికను ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది.?
జ : ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి పరిష్కార నెట్వర్క్
2) హాస్యం సభ్య దేశాల సంఖ్య ఎంత.?
జ : 10
3) సింధు ప్రజల లిపిని ఏమని పిలుస్తారు.?
జ : సర్పలేఖనం
4) సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టినది ఎవరు.?
జ : దయారాం సాహ్ని
5) భారతదేశంలో అత్యధిక తలసరి గృహ వినియోగ విద్యుత్ ఉన్న రాష్ట్రం ఏది.?
జ : పంజాబ్
6) ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది.?
జ : గోవా
7) ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు మొట్టమొదటి భారత మహిళా అధ్యక్షురాలిగా సరోజినీ నాయుడు ఉన్నారు.?
జ : కాన్పూర్ (1925)
8) ‘మా గూడెంలో మహారాజ్యం’ అనే పేరుతో గిరిజన ప్రజల హక్కుల కోసం పోరాడిన వీరుడు ఎవరు.?
జ : కొమరం భీం
9) 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామా చేసిన మొట్టమొత్తది మంత్రి ఎవరు.?
జ : కొండా లక్ష్మణ్ బాపూజీ
10) ‘తెలంగాణ సరిహద్దు గాంధీ’ అని ఎవరికి పేరు.?
జ : జమలాపురం కేశవరావు
11) బంగారు తెలంగాణ నినాదం ఇచ్చినవారు ఎవరు.?
జ : కేసీఆర్
12) విశాలాంధ్ర ఉద్యమ భావాన్ని కలిగించిన మొదటి నాయకుడు.?
జ : పుచ్చలపల్లి సుందరయ్య
13) ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యానికి నేతృత్వం ఎవరు.?
జ : ఎల్ ఎడ్రోస్
14) 1947 డిసెంబర్ 4న నిజాం కారు మీద బాంబు వేసిన వ్యక్తి ఎవరు.?
జ : నారాయణ రావు పవార్
15) హైదరాబాద్ రాష్ట్రంలో జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినది ఎవరు?
జ : రామానంద తీర్థ
16) హైదరాబాద్ స్టేట్ కు సంబంధించి భాగ్యనగర్ రేడియో ఎక్కడి నుంచి ప్రసారాలు ప్రారంభించేది.?
జ : కర్నూలు కేంద్రంగా
17) నిజాం కాలేజీ తొలి ప్రిన్సిపాల్ గా ఎవరు పనిచేశారు.?
జ : అఘోరనాథ్ చటోపాధ్యాయ
18) సింగరేణి కాలరీస్ కంపెనీ ఎప్పుడు స్థాపించారు.?
జ : 1920
19) నిజాం రాజ్యంలో నిజాం ప్రత్యక్ష పాలన కింద ఉండే భూమిని ఏమని పిలిచేవారు.?
జ : దివాని లేక ఖల్సా
20) ‘మన నిజాం రాజు జన్మ జన్మల బూజు’ అని అన్నది ఎవరు?
జ : దాశరధి కృష్ణమాచార్యులు
21) రేఖాంశాలు ఎక్కడ కలుస్తాయి.?
జ : ధ్రువాల వద్ద
22) మహాత్మా గాంధీ హత్య కొరకు నాదూరం గాడ్సే తో పాటు ఉరి తీయబడిన వ్యక్తి ఎవరు.?
జ : నారాయణ ఆప్టే
23) భారత్ గ్రీకు కలయికతో ఉద్భవించిన వాస్తు కలను ఏమని పిలుస్తారు.?
జ : గాంధార
24) చంద్రుడు భూమి పరిమాణంలో ఎన్నవ వంతు ఉంటుంది.?
జ : 1/50 వ వంతు
25) ‘వజ్రాల భూమి’ అని ఏ రాష్ట్రానికి పేరు.?
జ : మణిపూర్
26) కన్యాశుల్కం యొక్క గ్రంథ రచయిత ఎవరు.?
జ : గురజాడ అప్పారావు
27) ‘భీమ ఖండం’ అనే తెలుగు ప్రబంధాన్ని రచించినది ఎవరు.?
జ : శ్రీనాథుడు
28) ఉత్తర భారత దేశాన్ని, దక్కన్ పీఠభూమిని వేరు చేయు నది ఏది.?
జ : నర్మదా
29) విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏ రకానికి చెందినవి.?
జ : అనుదైర్ఘ్య తరంగాలు
30) శరీరంలోని రక్తం గడ్డ కట్టకుండా ఉండుటకు కారణం అయ్యేది.?
జ : హెపారిన్

