BIKKI NEWS : Daily GK bits in Telugu part 173. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్ రౌండప్.
Daily GK bits in Telugu part 173
1) భారత దేశానికి మధ్యగా వెళ్లే రేఖాంశం ఏది.?
జ : 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం
2) రెండు రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలకు రాజధానిగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది.?
జ : చండీగఢ్
3) విస్తీర్ణ పరంగా భారత దేశంలో అతి పెద్ద, అతి చిన్న రాష్ట్రాలు ఏవి.?
జ : రాజస్థాన్ & గోవా
4) పార్లమెంటు ఆమోదించిన ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎంత కాలం అమలులో ఉంటుంది .?
జ : ఎంత కాలం అయినా
5) సూపర్ కండక్టివిటీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : కామర్లింగ్ ఓమ్స్
6) డైనమో ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది.?
జ : విద్యుత్ అయస్కాంత ప్రేరణ
7) అర్థ వాహకాన్ని వేడి చేస్తే దాని విద్యుత్ వాహకత ఏమవుతుంది.?
జ : పెరుగుతుంది
8) చార్జింగ్ పెట్టే బ్యాటరీని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : గాస్టన్ ప్లాంటే
9) ఇనుము లోహం సింధూ ప్రజలకు తెలుసా.?
జ : తెలియదు
10) ఒగ్గు కథను ఈ కులానికి చెందిన పురోహితులు ప్రదర్శిస్తారు.?
జ : కురుమ
11) గంగిరెద్దులాట కలను ఏ కులానికి చెందిన వారు ప్రదర్శిస్తారు.?
జ : పూజ గొల్ల కులము
12) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అతి తక్కువ జన సాంద్రత గల జిల్లా ఏది.?
జ : ఆదిలాబాద్ (170)
13) 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లా ఏది.?
జ : హైదరాబాద్ (954)
14) తెలంగాణలోని జన్నారం ప్రాంతంలో గల టైగర్ రిజర్వు ఏది.?
జ : కావ్వాల్
15) 1798 లో భారత దేశంలో సైన్య సహకార సంధికి అంగీకరించిన మొదటి పాలకుడు ఎవరు.?
జ : నిజాం ఆలీ ఖాన్
16) నిజాం రాజ్యాన్ని జిల్లాలుగా విభజించినది ఎవరు.?
జ : మెట్ కాఫ్
17) మొదటి సాలార్ జంగ్ పేరు ఏమిటి?
జ : మీర్ తురాబ్ అలీఖాన్
18) విజయనగర జమిందార్ విజయ రామరాజుని హతమార్చి బొబ్బిలి పులి అనే బిరుదు పొందినది ఎవరు?
జ : తాండ్ర పాపారాయుడు
19) హైదరాబాద్ లో ఆర్య సమాజ్ శాఖ మొదట ఎప్పుడు ప్రారంభించబడింది.
జ : 1892
20) గ్రంథాలయోద్యమమే తెలంగాణలో తొలి ఉద్యమం అని ఎవరు చెప్పారు.?
జ : సురవరం ప్రతాప రెడ్డి
21) శుద్ధి ఉద్యమం చేపట్టిన సమాజం ఏది.?
జ : ఆర్య సమాజం
22) భారతదేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ ఉత్పత్తి ఎంత శాతం.?
జ : 3%
23) భూమికి, సముద్ర తీరానికి మద్య గల సరిహద్దును ఏమంటారు.?
జ : ఖండతీరపు అంచు
24) మిశ్రమ లోహం ఇప్పటిలో ఉండే లోహ అనుఘటకాలు ఏవి.?
జ : రాగి & జింక్
25) అత్యధిక విద్యుత్ వాహకతను ప్రదర్శించే లోహం ఏది.?
జ : వెండి
26) ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఏ రుతుపవనా కాలాల ద్వారా అత్యధిక లబ్ధి చేకూరుతుంది.?
జ : నైరుతి రుతుపవనాలు
27) ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎప్పటి వరకు సాధించాలని నిర్ణయించుకున్నారు.?
జ : 2030
28) శరీరంలో ఆమ్ల, క్షార స్థితిని తటస్థంగా ఉంచుటలో ముఖ్య భూమిక పోషించు ఖనిజాలు ఏవి.?
జ : సోడియం & పొటాషియం అయానులు
29) బంగాళాదుంప చిప్స్ ఆక్సీకరణానికి లోను కాకుండా ఉండటానికి ఏ వాయువును నింపి ప్యాకింగ్ చేస్తారు.?
జ : నైట్రోజన్
30) నెయిల్ పాలిష్ రిమూవర్ లో ఉపయోగించే రసాయనము ఏమిటి.?
జ : ఎసిటోన్

