BIKKI NEWS (Aug 02) : NEET UG 2026 counselling schedule. NEET UG 2026లో అర్హత సాధించిన విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. నాలుగు రౌండ్‌లలో కౌన్సెలింగ్ నిర్వహించనుండగా, రౌండ్-1, రౌండ్-2, రౌండ్-3, స్ట్రే వెకెన్సీ రౌండ్ తేదీలను ప్రకటించింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర కోటా (85%) కౌన్సెలింగ్‌ను KNRUHS ప్రత్యేక షెడ్యూల్ ప్రకారం నిర్వహించనుంది.
NEET UG 2026 counselling schedule
ఆల్ ఇండియా కోటా (15% AIQ) – MCC కౌన్సెలింగ్ షెడ్యూల్
రౌండ్-1 : రిజిస్ట్రేషన్: ఆగస్టు 4 – 17
- ఛాయిస్ ఫిల్లింగ్ & లాకింగ్: ఆగస్టు 13 – 22
- సీట్ అలాట్‌మెంట్ ఫలితం: ఆగస్టు 24
- కళాశాలలో రిపోర్టింగ్: ఆగస్టు 25 – 28
రౌండ్-2 : రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 1 – 7
- ఛాయిస్ ఫిల్లింగ్: సెప్టెంబర్ 2 – 7
- సీట్ అలాట్‌మెంట్: సెప్టెంబర్ 9
- రిపోర్టింగ్: సెప్టెంబర్ 10 – 16
రౌండ్-3 : రిజిస్ట్రేషన్: సెప్టెంబర్ 22 – 28
- ఛాయిస్ ఫిల్లింగ్: సెప్టెంబర్ 23 – 28
- సీట్ అలాట్‌మెంట్: సెప్టెంబర్ 30
- రిపోర్టింగ్: అక్టోబర్ 1 – 8
స్ట్రే వెకెన్సీ రౌండ్ : రిజిస్ట్రేషన్: అక్టోబర్ 15 – 19
- సీట్ అలాట్‌మెంట్: అక్టోబర్ 21
- రిపోర్టింగ్: అక్టోబర్ 22 – 25
తెలంగాణ రాష్ట్ర కోటా (85%) – KNRUHS కౌన్సెలింగ్
తెలంగాణలో రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) నిర్వహిస్తుంది. MCC షెడ్యూల్‌కు అనుగుణంగా రాష్ట్ర కౌన్సెలింగ్ జరుగుతుంది.
రాష్ట్ర కోటా కొరకు మొదటి విడత ఆగస్టు 13 నుంచి 22 వరకు కౌన్సిలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆగస్టు 28 ను సీట్లు కేటాయింపు పూర్తి చేయనున్నారు.
రెండో విడత ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 8 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
మూడో విడత సెప్టెంబర్ 16 నుంచి 26 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు
మిగిలిన సీట్లకు అక్టోబర్ 3 నుంచి 5 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు.
గమనిక: తెలంగాణ రాష్ట్ర కోటాకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను KNRUHS ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తుంది.
విద్యార్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు
15% ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ను MCC నిర్వహిస్తుంది.
85% రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌కు KNRUHS వెబ్‌సైట్‌లో విడిగా నమోదు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రిపోర్టింగ్ తేదీలను తప్పకుండా పాటించాలి.
సీట్ల కేటాయింపు NEET ర్యాంక్, రిజర్వేషన్, ఎంపిక చేసిన కళాశాలలు మరియు సీట్ల లభ్యత ఆధారంగా ఉంటుంది.
